ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో.. ఆ పార్టీ నేతలంతా తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇప్పటికే కొందరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొందరు వైసీపీ నేతలు విదేశాలకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. అయితే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ తరుపున గెలుపొందిన నలుగురు ఎంపీలు వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే మిథున్ రెడ్డి ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారని.. రేపో, మాపో ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమని గుసగుసలు వినిపించాయి. ఇటీవల ఆ వార్తలను మిథున్ రెడ్డి స్పందిస్తూ.. బీజేపీలోకి వెళ్లాల్సిన ఖర్మ తనకు పట్టలేదని స్పష్టం చేశారు. వైసీపీలోనే ఉంటానని వెల్లడించారు.
అయితే ఇప్పుడు కడప నుంచి గెలుపొందిన వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దలతో అవినాశ్ రెడ్డి చర్చలు జరిపారని.. త్వరలోనే ఆయన కాషాయపు కండువా కప్పుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీలు బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యలపై వైఎస్ అవినాశ్ రెడ్డి స్పందిస్తూ.. ఆదినారాయణ రెడ్డిపై భగ్గుమన్నారు. పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఆదినారాయణ రెడ్డిని ఉద్దేశించి అవినాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. పూటకో పార్టీ మార్చే ఆదినారాయణ రెడ్డికి ఇటువంటి ఆలోచనలే వస్తాయని.. తమకు రావని విమర్శించారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తామని.. ఎట్టి పరిస్థితిలోనూ జగన్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎల్లో మీడియా కావాలనే పార్టీ మారుతున్నారంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు కూడా తనపై తప్పుడు ప్రచారం చేసినప్పటికీ.. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషితో గెలుపొందానని వైఎస్ అవినాశ్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE