తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరు జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

Supreme Court Collegium Recommends Transfer Of 7 Judges Of High Courts Of Telangana Ap Madras,Supreme Court Collegium, Transfer Of 3 Judges Telangana High Court, Transfer Of Two Judges From Ap High Court,Mango News,Mango News Telugu,Supreme Court Transfer Of Madras 2 Judges,Telangana High Court,Ap High Court,Madras High Court,Telangana Hc,Ap Hc,Madras Hc,Telangana,Ap,Madras

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల (జడ్జిల) బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. నవంబర్ 24, గురువారం జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మద్రాస్ హైకోర్టులకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల వివరాలు:

  1. మద్రాస్ హైకోర్టు నుంచి జస్టిస్ వి.ఎం వేలుమణి కలకత్తా హైకోర్టుకు బదిలీ
  2. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ
  3. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జస్టిస్ డి.రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ
  4. తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ లలిత కన్నెగంటి కర్ణాటక హైకోర్టుకు బదిలీ
  5. తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ డి.నాగార్జున్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ
  6. మద్రాస్ హైకోర్టు నుంచి జస్టిస్ టి.రాజా రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ
  7. తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ ఏ.అభిషేక్ రెడ్డి పాట్నా హైకోర్టుకు బదిలీ.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 12 =