అసని తుఫానుపై సీఎం జగన్‌ అత్యవసర సమీక్ష.. సహాయక శిబిరాలలో ఉన్న కుటుంబాలకు రూ. 2 వేలు ఆర్ధిక సాయం

CM Jagan Orders To Give Rs 2000 For The Families who Moved To Relief Camps During Asani Cyclone, AP CM YS Jagan Orders To Give Rs 2000 For The Families who Moved To Relief Camps During Asani Cyclone, 2000 For The Families who Moved To Relief Camps During Asani Cyclone, AP CM YS Jagan Orders To Give Rs 2000 For The Families who Moved To Relief Camps, CM Jagan Orders To Give Rs 2000 For The Families who Moved To Relief Camps, Families who Moved To Relief Camps During Asani Cyclone, Relief Camps During Asani Cyclone, Relief Camps, Asani Cyclone, Cyclonic Storm Asani, Cyclonic Storm Asani News, Cyclonic Storm Asani Latest News, Cyclonic Storm Asani Latest Updates, Cyclonic Storm Asani Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ‘అసాని’ తుఫానుపై అత్యవసర సమీక్ష జరిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ మొదట ఒడిశా వైపు వెళ్తున్నట్లు కనిపించినా, తర్వాత అది దిశ మార్చుకుని ఆంధ్రవైపుగా పయనించటం, విశాఖ-కాకినాడ జిల్లాల మధ్య తీరం దాటుతుందన్న అంచనాల నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తుపానుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అలాగే సహాయక శిబిరాలకు తరలించిన కుటుంబాలకు రూ. 2 వేలు తక్షణ ఆర్ధిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకే వ్యక్తి ఉన్న నేపథ్యంలో రూ. వెయ్యి అందించాలని చెప్పారు. దీనితో పాటు ఆహారం, రేషన్‌, మందులు సకాలంలో అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లకు వచ్చే కాల్స్‌ పట్ల వెంటనే స్పందించాలని, తక్షణమే సహాయం అందించాలని ఆదేశించారు.

తుఫాన్ అత్యవసర కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవే..
  • శ్రీకాకుళం – 08942-240557
  • విజయనగరం – 08922-236947
  • పార్వతీపురం మన్యం – 7286881293
  • విశాఖపట్నం – 0891-2590100,102
  • అనకాపల్లి – 7730939383
  • తూర్పు గోదావరి – 8885425365
  • కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ – 18004253077
  • ఏలూరు కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ – 18002331077
  • మచిలీపట్నం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ – 08672 252572
  • బాపట్ల కంట్రోల్‌ రూమ్‌ నంబర్స్ – 8712655878, 8712655881
  • ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ – 90103 13920
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − six =