రెండు రోజులుగా ఏపీ ,తెలంగాణలో ఆసక్తి రేపుతున్న అంశంలో ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశమే అన్నది ఒప్పుకొని తీరాల్సిందే. చంద్రబాబు , రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య ఉన్న గాఢానుబంధం అందరికీ తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అవడానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం దానికి రేవంత్ రెడ్డి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం చకచకా జరిగిపోయాయి. దీంతో మరికొద్ది సేపట్లో ఇద్దరూ భేటీ కానుండటంతో వీరిద్దరి మధ్య చోటు చేసుకోబోయే చర్చాంశాలేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఇది ఆంధ్రా,తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక అసాధారణమైన సమావేశం చోటు చేసుకోబోతోందనే చెప్పొచ్చు. వ్యక్తిగతంగా ఎంతో చనువున్న ఇద్దరు ముఖ్య మంత్రులు హైదరాబాద్ లో సమావేశం అవుతున్నారు. వారిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకోవడంలో పెద్ద ఆసక్తి ఉండకపోవచ్చు కానీ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా కలుసుకోవడమే ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.
ఏపీ ,తెలంగాణ రెండు రాష్ట్రా ల మధ్య ఇప్పటి వరకూ పరిష్కారం కాని చాలా సమస్యలు వీరి భేటీలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మెయిన్‌గా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల వాటాల పంపిణీతో పాటు గోదావరి, కృష్ణా జలాల అంశాలు ఈ భేటీలో కీలకంగా మారుతున్నాయి. అయితే కొన్ని సంస్థల ఆధ్వర్యంలో ఉన్న ఆస్తుల పంపిణీ ఎప్పుడో జరిగి ఉండేదని.. కానీ ఏపీ సీఎంలు అనవసరంగా మొండి పట్టుదలకు పోయి ఈ విషయాలను మరింత జటిలం చేస్తున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
తాజాగా చంద్ర బాబు ఏపీ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ..తాను ఎటువంటి భేషజాలకు పోబోవడం లేదని చెబుతూనే.. రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. తన ముందున్న లక్ష్యాల్లో ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును పూర్తి చేయడమేనని చెప్పి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
దీనిలో భాగంగానే ఇప్పుడు ఇలాంటి అనేక అంశాలు దృష్టిలో ఉంచుకునే ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి ఉంటారని తెలుస్తుంది.దీంతో వీరిద్దరి భేటీతో నూతన శకం మొదలయినట్లేనని.. రెండు రాష్ట్రాలు సమస్యలపై శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడతాయన్న అం చనాలు పెరుగుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY