గుంటూరు మిర్చి ఎంత ఘాటో.. పార్లమెంట్ పరిధిలో రాజకీయాలూ అంతే హాట్ హాట్‌గా మారుతున్నాయి. పసుపుపార్టీ తెలుగుదేశం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో దిగిన నాటి నుంచీ పరిస్థితులు తారుమారయ్యాయి. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలనూ ఒక్కసారి అలా చుట్టొచ్చారు.. అంతే రాజకీయాలు వేడెక్కాయి.. పసుపుదళం బలం పెరిగింది.. నీచరాజకీయాల కారణంగా కొంతకాలం నుంచీ గల్లా మౌనం వహించడంతో నిశ్శబ్దంగా ఉన్న టీడీపీ కోటకు కొండంత అండ దొరికింది.. తన చేతలతో, వ్యాఖ్యలతో పెమ్మసాని ఇచ్చిన ధైర్యంతో తెలుగుదేశం శ్రేణుల్లో భరోసా అధికమైంది.. ఫలితంగా గుంటూరు లోక్‌సభ పరిధిలో ఎక్కడ చూసినా పసుపుజెండా ఎగురుతోంది..
గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో దిగిన నాటి నుంచీ పార్టీ మరింత యాక్టివ్ అయింది. సేవాకార్యక్రమాల ద్వారా అప్పటికే ఎంతో పేరుప్రఖ్యాతలు పొందిన పెమ్మసాని జనం మధ్యకు రావడంతో కార్యకర్తల్లో హుషారు పెరిగింది. గుంటూరు తూర్పు.. గుంటూరు పశ్చిమ.. తెనాలి.. పొన్నూరు.. ప్రత్తిపాడు.. తాడికొండ.. మంగళగిరి.. ఇలా లోక్‌సభ పరిధిలోని ఏ నియోజకవర్గంలో పెమ్మసాని పర్యటించినా అధిక సంఖ్యలో జనం తరలివస్తున్నారు. కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఆ ప్రాంతాలన్నీ పసుపుజెండామయం అవుతున్నాయి.
దాదాపు 15 ఏళ్లుగా పార్టీని వెనకుండి నడిపిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్.. వాస్తవానికి గత ఎన్నికల్లోనే నరసారావు పేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంది. కానీ.. 2019లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు పార్టీ అవకాశం ఇవ్వడంతో టీడీపీకి విధేయుడైన పెమ్మసాని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ అమెరికా వెళ్లినప్పటికీ జిల్లాలో పార్టీ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో పార్టీకి పెమ్మసాని చేస్తున్న కృషిని, ఆయనకు స్థానికంగా ఉన్న గుర్తింపును పరిశీలనలోకి తీసుకున్న అధినేత చంద్రబాబునాయుడు 2024 ఎన్నిక్లలో పెమ్మసానికి గుంటూరు నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ.. పోటీ పక్కా అని తేలిపోవడంతో పెమ్మసాని ప్రచారం మొదలుపెట్టారు.
ప్రచారం మొదలుపెట్టిన కొద్ది కాలంలోనే పార్టీపరంగా గణనీయమైన మార్పులు తెచ్చారు. అప్పటికే బలంగా పార్టీని ప్రతిపక్షాలు కదపలేనంత స్ట్రాంగ్ గా మారుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు పక్కా అని.. స్టాంప్ పడేలా చేసుకుంటున్నారు. ఎంతలా అంటే.. అధికారంలో ఉన్నప్పటికీ.. గుంటూరు లోక్‌సభ పరిధిలో ఎక్కడా వైసీపీ ఊసు వినిపించడం లేదు.. జెండా అంతగా కనిపించడం లేదు.. ఇదంతా గమనిస్తున్న టీడీపీ అధిష్టానం.. పెమ్మసాని ప్రయత్నాన్ని అభినందిస్తూ భుజం తట్టి ప్రోత్సహిస్తోంది. చంద్రశేఖరా.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇలాగే శ్రమించు.. గెలుపు నీదే.. అని భరోసా ఇస్తోంది. విద్య, వ్యాపార రంగాల్లో సక్సెస్ అంటే గుర్తొచ్చే పెమ్మసాని పేరు.. రాజకీయాల్లోనూ ఇంత త్వరగా తెరపైకి వస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరేమో..!
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE