క‌ట్టండ‌య్యా.. ఇళ్లు.. క‌మీష‌న్లు తీసుకోకుండా..! ఎమ్మెల్యే శివ‌కుమార్ కు పెమ్మ‌సాని అదిరిపోయే కౌంట‌ర్‌

Tenali MLA siva kumar, pemmasani chandrasekhar, ap elections, guntur,Alapati Rajendra Prasad,tdp-janasena,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics,andhra pradesh,AP,AP Political Updates,Mango News Telugu,Mango News
Tenali MLA siva kumar, pemmasani chandrasekhar, ap elections, guntur

డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది గుంటూరుగా మారిపోయారు.. తొలిఅడుగుల్లోనే రాజ‌కీయంగా ఆయ‌న చేస్తున్న కామెంట్లు.. ఇస్తున్న కౌంట‌ర్లు.. అదిరిపోతున్నాయి. ఇంకోసారి పెమ్మ‌సానిపై విమ‌ర్శ‌లు చేయాల‌న్నా.. ఆరోప‌ణ‌లు చేయాల‌న్నా.. ఆలోచించాల్రోయ్.. అని వైసీపీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రిగిలే చంద్ర‌శేఖ‌ర్ స్పందిస్తున్న తీరు ఉంటోంది. అందుకు తాజాగా మ‌రో ఉదాహ‌ర‌ణ‌.. ఎమ్మెల్యే శివ‌కుమార్ కు గుంటూరు లోక్ స‌భ టీడీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఇచ్చిన కౌంట‌ర్‌.

ఇటీవ‌ల తెనాలి ఎమ్మెల్యే శివ‌కుమార్ ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. తాను పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చానని అన్నారు. ఎవ‌రైతే తెలుగుదేశం పార్ల‌మెంట్ అభ్య‌ర్థి అని చెప్పుకుంటున్నారో.. ఆ పెమ్మసాని చంద్ర‌శేఖ‌ర్ ఇంటి ప‌క్క‌నే ఇళ్ల స్థలాలు ఇచ్చానంటూ వైసీపీ ప్ర‌భుత్వం చేసిన గొప్ప‌లు చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. దెబ్బ‌కు దెబ్బ‌.. మాట‌కు మాట‌.. బ‌దులియ్య‌కుంటే.. నేటి రాజ‌కీయాల్లో కుద‌ర‌ద‌ని ముందే సిద్ధ‌మై వ‌చ్చిన పెమ్మ‌సాని.. శివకుమార్ కు అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చారు.. అందులోనూ పేద‌ల సంక్షేమాన్ని వ‌ద‌ల‌లేదు. పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టాల్సిందే కానీ.. అవి ఆత్మ‌గౌర‌వంతో నివ‌శించేలా అనువుగా ఉండాలని తేల్చి చెప్పారు.

తెనాలి మండలం పెదరావూరు లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ-జ‌న‌సేన మండల కార్యకర్తల ఆత్మీయ స‌మావేశంలో పాల్గొన్న డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ.. వైసీపీకి చుర‌క‌లు అంటించారు. స్థానిక ఎమ్మెల్యేకు ఘాటు రిప్ల‌య్ ఇచ్చారు.. ‘‘పేద‌ల‌కు ఇళ్లు.. నా ఇంటి ప‌క్కనే కాద‌య్యా.. ముందూ క‌ట్టు.. వెన‌కా క‌ట్టు. కానీ.. క‌మీష‌న్ తీసుకోకుండా క‌ట్టు.. 20 ల‌క్ష‌లున్న భూమిని 40 ల‌క్ష‌లు చేశారు. ఆ డ‌బ్బు మీరు తీసుకున్నారా.. మీ అధినేత‌కు పంపారా చెప్పాలి. అవ‌న్నీ జ‌నానికి తెలుసు..  అందుకే త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో మీకు దిమ్మ‌తిరిగేలా  తీర్పు ఇవ్వ‌బోతున్నారు.. అవినీతిప‌రుల‌ను ఒక్క‌దెబ్బ‌కు ఎలిమినేట్ చేస్తారు.. చూడండి.. శివ‌కుమార్‌’’ అని బ‌దులిచ్చారు డాక్ట‌ర్ పెమ్మ‌సాని.

వైసీపీకి, వైసీపీ నేత‌ల‌కు త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ అటాక్ లు ఇస్తూనే.. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కులకు విలువైన సూచ‌న‌ల‌ను, రాజ‌కీయంగా త‌న ఉద్దేశాల‌ను చాటి చెప్పారు పెమ్మ‌సాని. రోడ్ల దుస్థితిని.. వైసీపీ చేస్తున్న ఇలాంటి అరాచ‌కాల‌ను నా చిన్న‌నాటి నుంచీ ఎన్న‌డూ చూడ‌లేద‌న్నారు. అందుకే ఇలాంటి ప్ర‌భుత్వం మ‌ళ్లీ రాకుండా చూసుకోవాల‌న్నారు. పేద వ‌ర్గాలు, క‌డుపునిండ‌ని వ‌ర్గాలు.. ఒక్కోసారి బ‌ల‌హీన‌త‌కు లోనై వైసీపీకి ఓటు వేసే అవ‌కాశం ఉంటుందని.. ఆ ప‌రిస్థితుల‌న్నీ గ‌మ‌నిస్తూ ఆప్ర‌మ‌త్తంగా ఉండాలని.. మ‌రోసారి వైసీపీ ప్ర‌భుత్వం రాకుండా అడ్డుప‌డాలని కార్య‌క‌ర్త‌ల‌కు పెమ్మసాని సూచించారు.

అలాగే.. టీడీపీ-జ‌న‌సేన కూట‌మి తెనాలి అభ్య‌ర్థి నాదెండ్ల గురించి మాట్లాడుతూ.. ఆయ‌న జ‌న‌సేన‌లో మంచి పొజిష‌న్‌లో ఉన్నారు.. రేపు మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే, అప్పుడు కూడా మంచి పొజిష‌న్‌లో ఉంటారు.. తెనాలిని అభివృద్ధి చేసే అవ‌కాశం ఉంటుంద‌ని వెల్ల‌డించారు. ఇవ‌న్నీ ఆలోచించుకుని.. రాష్ట్రంలో తెలుగుదేశం-జ‌న‌సేన కూట‌మికి ప్ర‌జ‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప‌ట్టం క‌ట్టాల‌ని డాక్ట‌ర్ పెమ్మ‌సాని పిలుపునిచ్చారు. ఆ రోడ్లు చూసి అన్నం తినే ఏ ఒక్కరూ వైసీపీకి ఓటు వేయలేరని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతి ఓటర్ నూ పోలింగ్ బూత్ కు తీసుకువెళ్లి ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత పార్టీ కార్య‌క‌ర్త‌లు అందరి పైనా ఉందని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =