సీఎం జగన్ కీలక ప్రకటన, 5.20 లక్షల మంది గృహ సారథులు, 45 వేల మంది కన్వీనర్ల ఎంపిక

CM Jagan Announces to Select 5.2 Lakh Gruha Saradhulu 45 Thousand Convenors to Strengthen the Party,CM Jagan's Key Announcement,Selection Of 5.20 Lakh Householders,Selection Of 45 Thousand Conveners,Mango News,Mango News Telugu,CM Jagan,CM Jagan Selection Of 5.20 Lakh Householders,CM Jagan Selection Of 45 Thousand Conveners,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులతో గురువారం క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వారికీ పలు అంశాలపై సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేస్తూ, 5.20 లక్షల మంది గృహ సారథులను నియమకంపై పార్టీ నేతలను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున 15 వేల గ్రామాల్లో 5.20 లక్షల మందిని పార్టీ తరఫున గృహ సారథులుగా నియమిస్తున్నామని చెప్పారు. ప్రతి 50 ఇళ్లను క్లస్టర్‌ గా చేసుకుని, ఒక పురుషుడు, ఒక మహిళ చొప్పున ఇద్దరు గృహ సారథుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని, గృహ సారథులు కూడా అదే క్లస్టర్‌కు చెందిన వారై ఉండాలన్నారు. వీరు బూత్‌ కమిటీలలో సభ్యులుగా కూడా ఉంటారని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

ఇక ప్రతి గ్రామ, వార్డు సచివాలయాన్నీ ఒక్కో క్లస్టర్ గా చేసుకుని ఒక్కోదానికి ఒక మహిళా సహా ముగ్గురు చొప్పున కన్వీనర్లతో రాష్ట్రవ్యాప్తంగా 45 మంది కన్వీనర్లను కూడా నియమిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 45 వేల మంది కన్వీనర్లు వారి పరిధిలో గల ఇంటింటికీ వెళ్లి పార్టీ సందేశాన్ని, పబ్లిసిటీ మెటీరియల్‌ని అందిస్తారని పేర్కొన్నారు. రాజకీయ అవగాహన కలిగి, చురుగ్గా పనిచేసే వారిని డిసెంబర్ 20వ తేదీ నాటికి కన్వీనర్లుగా ఎంపిక చేయాలని, నియోజకవర్గాల పరిశీలకులు ఈ ప్రక్రియను పూర్తిచేసేలా చూడాలన్నారు. కన్వీనర్ల ఎంపిక అనంతరం ప్రతి 50 ఇళ్ల క్లస్టర్‌కు ఇద్దరు చొప్పున గృహ సారథుల నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, పార్టీకీ మధ్య అనుసంధానకర్తలుగా కన్వీనర్లు, గృహ సారథులు ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఈ సమావేశం సందర్భంగా భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =