కేవలం వంటింటికే పరిమితంకాకుండా.. అన్ని రంగాల్లో భాగస్వామ్యులవుతున్నారు మహిళలు. నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనుండగా.. అక్కడ మహిళలే అత్యంత కీలకంగా మారబోతున్నారు. ఎందుకంటే 150కి పైగా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గెలుపోటములను వారే డిసైడ్ చేయబోతున్నారు. ఎన్నికల్లో కీలక భూమిక పోషించబోతున్నారు. ఈక్రమంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వేళ మహిళలను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇటీవల ఎన్నికల సంఘం ఏపీ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం ఏపీలో మొత్తం 4,08,07,256 మంది ఓట్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 2,00,74,322 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 2,07,29,452 మంది ఉన్నారు. మొత్తం ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 156 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 5 వేల నుంచి 7 వేల మంది మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉన్నారట. మహిళల ఓటింగ్ శాతం పెరిగితే ఆయా నియోజకవర్గాల్లో ఫలితాలపై మహిళా ఓటర్ల ప్రభావం కీలకంగా మారనుంది.
పార్వతీపురం, కురుపాం, శృంగవరపుకోట, ఇచ్చాపురం, కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, కర్నూల్, నంద్యాల, నందికొట్కూర్, పాన్యం, మదనపల్లె, అనంతపురం, శ్రీకాళహస్తి, నగరి, చంద్రగిరి, తుని, రామచంద్రాపురం, రాజమండ్రి రూరల్, భీమవరం, రాజానగరం, తణుకు, పోలవరం, తాడేపల్లిగూడెం, గన్నవరం, పెనమలూరు, గుడివాడ, నందిగామ, విజయవాడలోని మూడు జోన్లు, తెనాలి, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, ప్రకాశం, నెల్లూరు, ఒంగోలు, కోవూర్, గూడూర్, నెల్లూరు సిటీ, సూళ్లూరు, రాజంపేట, వెంకటగిరి నియోజకవర్గాలతో పాటు మరికొన్ని స్థానాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారట. మరి మహిళాలోకం ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతుందో? ఎవరికి అధికారం కట్టబెడుతుందో? చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE







































