తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు ఎడిటర్‌గా కోలా భాస్కర్ పనిచేశారు. ఖుషి, 7/జీ బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, 3, యుగానికి ఒక్కడు, వర్ణ, పొక్కిరి చిత్రాలకు ఎడిటర్‌గా మంచిపేరు సంపాదించారు. అలాగే తన కుమారుడు బాలకృష్ణ హీరోగా నిన్ను వదిలి నేను పోలేనులే అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. కోలా భాస్కర్ మృతి పట్ల తెలుగు, తమిళ సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ