సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి సంతాపంగా రేపు తెలుగు చిత్ర పరిశ్రమ బంద్, ప్రకటించిన నిర్మాతల మండలి

Telugu Film Producers Council Announces Industry Bandh on Tomorrow To Mourn The Demise of Superstar Krishna,Telugu Film Industry Bandh, Announced By The Producers Council, Mourning Death Of Superstar Krishna,Mango News,Mango News Telugu,Pm Narendra Modi,Celebrities Expressed Condolences,Superstar Krishna Passes Away,Tollywood Senior Actor Krishna,Superstar Krishna Illness,Actor Superstar Krishna,Superstar Krishna,Senior Actor Krishna,Superstar Krishna Latest News And Updates,Actor Krishna,Krishna News And Live Updates,Superstar News And Updates

సీనియర్ తెలుగు నటుడు, నిర్మాత, దర్శకుడు సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. తీవ్ర అస్వస్థతో సోమవారం ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించి మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అభిమానులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నానక్‌రాంగూడలోని కృష్ణ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక ప్రకటన చేసింది. సూపర్‌స్టార్ కృష్ణ మృతికి సంతాపంగా రేపు తెలుగు చలనచిత్ర పరిశ్రమ బంద్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ‘ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత సూపర్‌స్టార్ కృష్ణ గారు ఈరోజు ఉదయం హెదరాబాద్ లో స్వర్గస్తులైనారు. కాబట్టి కృష్ణ గారికి గౌరవ సూచకంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ రేపు (బుధవారం, 16-11-2022) మూసివేయడం జరుగుతుంది’ అని ప్రకటనలో నిర్మాతల మండలి తెలియజేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here