రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్ట్

Arnab Goswami Arrested, Arnab Goswami arrested in 2018 abetment, Arnab Goswami Arrested In Mumbai, Chief Arnab Goswami Arrested, Republic TV editor, Republic TV Editor In Chief, Republic TV Editor In Chief Arnab Goswami Arrested, TRP scam case

ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నాబ్ గోస్వామిని ఈ రోజు ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. 2018 లో అలీబాగ్‌లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్‌ నాయక్ మరియు అతని తల్లి కుముద్ నాయక్ ‌ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించారనే ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. రాయఘడ్, ముంబయి పోలీసులు ఈ కేసును సంయుక్తంగా దర్యాప్తు చేస్తుండగా, అర్నాబ్ పై ఐపీసీ సెక్షన్ 306,34 కింద అభియోగాలు నమోదు చేరినట్టు తెలిపారు. మరోవైపు ఈ అరెస్ట్ పై అర్నాబ్ భార్య సమ్యబ్రాతా రే స్పందిస్తూ, కనీసం లాయర్ వచ్చేంత వరకైనా సమయం ఇవ్వకుండా, పోలీసులు అర్నాబ్ ను లాకెళ్లినట్లు ఆరోపించారు.

ఇక అర్నాబ్ అరెస్ట్ పై పలువురు కేంద్రమంత్రులు స్పందించారు. “మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడిని మేము ఖండిస్తున్నాము. ప్రెస్‌తో ప్రవర్తించే తీరు ఇది కాదు. ప్రెస్ తో ఇలా వ్యవహరించడం ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుంది” అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులు జయశంకర్, స్మృతి ఇరానీలు సహా పలువురు అర్నాబ్ అరెస్టు ఖండించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 18 =