‘రాధేశ్యామ్’ ట్రైలర్ రిలీజ్

Hero Prabhas Starred Radhe Shyam Movie Trailer Released, Pan India Star Hero Prabhas, Pan India Star Hero Prabhas Starred Radhe Shyam Movie, Pan India Star Hero Prabhas Starred Radhe Shyam Movie Trailer Released, Prabhas, Prabhas & Pooja Hegde starrer romantic drama, Radhe Shyam, Radhe Shyam Movie Trailer

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ‘రాధేశ్యామ్’ ట్రైలర్ వచ్చేసింది. దీనికోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సాహో’ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఇదే కావటంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. ట్రైలర్ ఆసాంతం ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది. చాలా స్టైలిష్ లుక్ తో కనిపించాడు. పూజ హెగ్డే ఫుల్ గ్లామరస్ గా కనిపించింది. ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ చాలా లావిష్ గా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజులో ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ ట్రైలర్ తో సినిమాపై హైప్ తారాస్థాయికి చేరింది.

పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే సూపర్ స్టైలిష్ క్యారెక్టర్ లో అభిమానులకు కనువిందు చేయనున్నాడు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా టాలీవుడ్ లక్కీ గర్ల్ పూజహెగ్డే నటిస్తుంది. ‘జిల్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించేలా టాప్ సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ