రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డుల జారీపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

CS Somesh Kumar Held High Level Review on Issue of Aadhar Card and Linking Aadhar with Mobile Number

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అందచేయడంతో పాటు ఆధార్ కార్డులను వ్యక్తిగత మొబైల్ నెంబర్ లకు అనుసంధానం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డుల జారీ, ఆధార్ కార్డులకు మొబైల్ నెంబర్ల అనుసందానంపై నేడు బీ.ఆర్.కె.ఆర్ భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ ఏటా ఆరు లక్షల మంది జన్మిస్తున్నారని వీరందరికీ వెంటనే ఆధార్ కార్డులను జెనరేట్ చేయాలని అన్నారు.

రాష్ట్రంలో 0-5 సంవత్సరాల మధ్య వయస్సుగల వారందరికీ ఆధార్ జనరేట్ చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఆధార్ సీడింగ్ కేంద్రాలు లేని మండలాలన్నింటిలో ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఐ.టీ. శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవీ గుప్త, పంచాయితీ రాజ్ కార్యదర్శి సందీప్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి, సివిల్ సప్లై కమీషనర్ అనీల్ కుమార్, అడిషనల్ సి.ఈ.ఓ డా.జ్యోతి బుద్ధ ప్రకాష్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డీ. దివ్య, యుడై హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డీడీజి సంగీత తదితరులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + fourteen =