మేడారం మహాజాతరకు టీఎస్ ఆర్టీసీ సన్నాహాలు

2022 Medaram Jatara, Mango News, Mango News Telugu, Medaram Jatara 2022, medaram jatara 2022 dates, Medaram Jatara Arrangements, Medaram Jatara Latest News, Medaram Jatara News, Medaram Jatara Updates, Medaram Jathara Latest News, medaram sammakka sarakka jatara, Medaram Sammakka Sarakka Jatara 2022, sammakka sarakka jatara, Sammakka Sarakka Jatara 2022, telangana, TSRTC, TSRTC Plans Big Arrangements, TSRTC Plans Big Arrangements For Medaram Jatara 2022

తెలంగాణ ఆర్టీసీ మేడారం మహాజాతర కోసం ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోంది. వరంగల్ లో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మేడారం జాతర జరగనుంది. దీని కోసం తెలంగాణ ఆర్టీసీ 3845 బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. సుమారు 21 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో 2020లోనూ దాదాపు ఇదే సంఖ్యలో ఆర్టీసీ సర్వీసులు నడిపింది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భక్తులు ఎక్కువగా రానున్న నేపథ్యంలో ఒక్క వరంగల్ రీజియన్ నుంచే 2,250 బస్సులను నడిపేందుకు ప్రణాళిక వేసింది తెలంగాణ ఆర్టీసీ.

ఈసారి హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు కూడా నడిపేందుకు నిర్ణయించింది. ఈ జాతర సమయంలో అక్కడికి చేరుకున్న బస్సులను పార్కింగ్ చేసేందుకు దగ్గరలో ఉన్న ఖాళీ స్థలాలను చదును చేసి ఆర్టీసీ 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్ధం టికెట్లకు క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన పనులు బుధవారమే ప్రారంభమయ్యాయి. తెలంగాణలో జరిగే ఈ మేడారం మహాజాతర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =