రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళా పరిశోధకులకు నోబెల్‌ బహుమతి

2020 Nobel Prize For Chemistry, 2020 Nobel Prize in Chemistry, 2020 Nobel Prize in Chemistry awarded to Emmanuelle, Crispr wins the 2020 chemistry Nobel prize, Emmanuelle Charpentier and Jennifer A Doudna, Nobel Prize 2020, Nobel Prize For Chemistry, Nobel Prize in Chemistry, Nobel Prize in Chemistry 2020, Nobel Prize in chemistry awarded to two women

రసాయన శాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ఇద్దరు మహిళా పరిశోధకులకు నోబెల్‌ బహుమతి లభించింది. ‘జీనోమ్‌ ఎడిటింగ్‌’ కోసం ఓ పద్ధతిని అభివృద్ధి చేసినందుకు ఇమ్మాన్యూయెల్‌ చార్పెంటీర్‌ మరియు జెన్నీఫర్‌ ఏ డౌడ్నా అనే పరిశోధకులు నోబెల్‌ పురస్కారం అందుకోనున్నారు. 2020 సంవత్సరానికి గాను ఈ ఇద్దరికీ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సోమవారం నాడు వైద్య శాస్త్రంలో “హెపటైటిస్ సి వైరస్” యొక్క ఆవిష్కరణకు గానూ హార్వే జె. ఆల్టర్, మైఖేల్ హౌఘ్టన్ మరియు చార్లెస్ ఎం.రైస్‌లకు సంయుక్తంగా నోబెల్ బహుమతిని ప్రకటించారు.

అలాగే భౌతిక శాస్త్రంలో విశేషమైన కృషి చేసిన ముగ్గురు పరిశోధకులకు మంగళవారం నాడు నోబెల్‌ బహుమతి ప్రకటించారు. బ్లాక్ హోల్ ఫార్మేషన్ పై పరిశోధనలకు గానూ రోజర్‌ పెన్రోస్ కు సగం పురస్కారం అందించగా‌, రెండవ సగం పురస్కారాన్ని సూపర్ మాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్ ఆవిష్కరణకు గానూ రీన్హార్డ్ జెంజెల్ మరియు ఆండ్రియా ఘెజ్ లు అందుకున్నారు. ఇక సాహిత్యం, శాంతి, అర్ధశాస్త్రంలకు సంబంధించి వరుసగా‌ నోబెల్ బహుమతిలను ప్రకటించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu