ఒకే కాలేజీలో 49 విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

49 students test Covid positive, 49 students test Covid positive in Mangaluru, 49 students test positive for COVID-19 at Ullal college, 49 Students were Tested Corona Positive, 49 Students were Tested Corona Positive in a Nursing College, College Sealed in Karnataka Ullal, Karnataka Coronavirus, Karnataka Coronavirus News, Karnataka Coronavirus Updates, Mangalore, Mangaluru, Mango News, Nursing College in Ullal, Nursing College in Ullal near Mangalore

కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఉల్లాల్‌ లోగల ఓ నర్సింగ్ కాలేజీలో 49 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఆ కాలేజీలో మొత్తం 104 మంది సిబ్బంది మరియు విద్యార్థినులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 49 మందికి కి పాజిటివ్ గా తేలింది. కరోనా బారిన పడిన విద్యార్థులందరూ కేరళకు చెందినవారుగా గుర్తించారు. కొన్ని నెలల విరామం తర్వాత వారంతా పరీక్షలకు కోసం కాలేజీకి వచ్చినట్టుగా అధికారులు తెలిపారు.

అనంతరం మున్సిపల్ అధికారులు కాలేజీని సందర్శించి సీలు చేశారు. కాలేజీని ప్రాంగణాన్ని ఫిబ్రవరి 19 వరకు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ అనూహ్యమైనదని చెప్పారు. ఇప్పటికీ కరోనా ముప్పు అలాగే ఉందని, దయచేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకోడాన్ని ప్రజలు కొనసాగించాలని సూచించారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 9,40,596 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 9,22,437 మంది కరోనా నుంచి కోలుకోగా, 12,225 మంది మరణించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ