బహిరంగ మార్కెట్లో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ విక్రయానికి అనుమతి

Approval Granted by DCGI For Covaxin and Covishield Vccines Usage For Adults, COVAXIN And Covishield Granted Regular Market Approval, Covaxin Covishield get conditional market approval, Covaxin Covishield granted market approval in India, Covishield & Covaxin get DCGI’s conditional market approval, Covishield Covaxin Granted Regular Market Approval, DCGI grants conditional market approval for Covishield, DCGI grants regular market approval for Covishield, DCGI grants regular market approval to Covishield Covaxin, Mango News, Regular Market Approval Granted by DCGI For Covaxin and Covishield Vccines Usage For Adults, Regular market approval granted for Covishield

కరోనా మహమ్మారి భయంతో బ్రతుకుతున్న ప్రజలకు కొంచెం ఉపశమనం కలగనుంది. ఈ మహమ్మారి వ్యాప్తి అడ్డుకట్టకు టీకాలే కీలకమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాలకు విక్రయించేందుకు షరతులతో కూడిన అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) జారీ చేసింది. డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలో ఫార్మా సంస్థలు టీకాల ధరలను నిర్ణయించనున్నాయి.

మాములుగా, ఈ టీకా ధర బహిరంగ మార్కెట్లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉండనుంది. అయితే, దీనికి రూ.150 సేవా రుసుమ అదనంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవాగ్జిన్ ఒక డోసు ధర సేవా రుసుంతో కలిపి రూ.1200 ఉండగా.. కొవిషీల్డ్‌ ధర రూ.780 గా ఉంది. గతేడాది జనవరి 3న అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఈ రెండు టీకాలకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.

అయితే కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతి ఇవ్వాలని జనవరి 9న నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు సాధారణ అనుమతి కోసం అవసరమైన సమాచారాన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు భారత్ బయోటెక్ సంస్థలు ప్రభుత్వానికి అందజేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు టీకాలకు బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు అనుమతి లభించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here