
ప్రపంచవ్యాప్తంగా జులై 19న టెక్‌లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన ‘బ్లూ స్క్రీన్ ఎర్రర్’తో టెక్నికల్ ఎర్రర్ తలెత్తింది. ఊహించని ఉపద్రవం వల్ల విశ్వవ్యాప్తంగా లక్షల కంప్యూటర్లు మొరాయించాయి. అనుకోని ఈ పరిణామంతో అన్ని దేశాల్లో గందరగోళం మొదలైంది. ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఐటీ కంపెనీల్లో కంప్యూటర్లు షట్‌డౌన్ అవగా.. స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. బ్యాంకుల్లో లావాదేవీలు, ఎయిర్‌పోర్టులో విమానాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యకలాపాలకూ, చివరకు టీవీ చానళ్ల ప్రసారాలకూ ఆటంకాలు తప్పలేదు. అయితే సైబర్‌దాడి నుంచి రక్షించాల్సిన సాఫ్ట్‌వేర్ ‘క్రౌడ్‌స్ట్రైక్’ అప్‌డేషన్‌లో వచ్చిన బగ్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్టు మైక్రోసాఫ్ట్ శుక్రవారం రాత్రి ప్రకటించింది. చివరికి టెక్నికల్ సమస్యను పరిష్కరించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.
మైక్రోసాఫ్ట్‌లో శుక్రవారం తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా విండోస్‌తో పని చేసే లక్షలాది కంప్యూటర్లు వాటికవే షట్‌డౌన్ అయిపోయాయి. మళ్లీ ఆన్ చేయగానే కంప్యూటర్ల స్క్రీన్‌ల మీద ‘బ్లూస్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ కనిపించడంతో వినియోగదారులు అయోమయానికి గురయ్యారు. మీ పీసీలో సమస్య తలెత్తింది. రీస్టార్ట్ చేయండి’ అంటూ సందేశం స్క్రీన్‌పై దర్శనమిచ్చింది. అయితే, ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా ఇదే ప్రాబ్లెమ్ రిపీట్ అయింది. దీంతో చాలా దేశాల్లో ఇంటర్నెట్ ద్వారా పని చేసే వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి.
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన టెక్నికల్ ఇష్యూ వల్ల భారతదేశంలో మాత్రమే కాదు అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, శాంతి-భద్రతలు, బ్యాంకింగ్, ఐటీ, రైల్వే, ఆస్పత్రి, మీడియా, పేమెంట్ సర్వీసులు, స్టాక్ మార్కెట్లు, విమానయానం ఇలా అన్ని రంగాలు ఎఫెక్ట్ అయ్యాయి. విండోస్‌లో సమస్య వల్ల బ్రిటిష్ న్యూస్ ఛానెల్ స్కైన్యూస్ వార్తలను ప్రసారం చేయడంలో అవాంతరాలు ఎదుర్కొంది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సమస్యలు తలెత్తాయి. అక్కడి మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయాయి. జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఇలా ఐరోపాలోని అన్ని దేశాలపై ప్రభావం పడింది. ఆస్ట్రేలియాలోని వూల్‌వర్త్స్ అనే సూపర్ మార్కెట్ సేవల్లోనూ అంతరాయం తలెత్తింది. పాయింట్ ఆఫ్ సేల్స్‌లో కస్టమర్ల బ్యాంకు కార్డులు కూడా పనిచేయడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా చాలా విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. విమాన సేవలు ఆలస్యం అవడంతో పాటు క్యాన్సిలేషన్లు పెరిగాయి. మెల్‌బోర్న్, వర్జిన్ ఆస్ట్రేలియా, సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో కూడా చాలా విమానాలు నిలిచిపోయాయి. అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్, యూనైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఫ్రంటీయర్ ఎయిర్‌లైన్స్ సంస్థలు కొన్ని విమానాలను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఐటీ, ఐటీఈఎస్, ప్రైవేటు కార్యాలయాల్లోనూ అన్ని సర్వీసులు నిలిచిపోయాయి. బ్యాంకులు, ఆస్పత్రులు, మీడియాపైన కూడా ప్రభావం పడింది. చివరకు కొన్ని దేశాల్లో ఆన్‌లైన్‌తో లింక్ అయి ఉన్న పోలీసుల వ్యవస్థలు కూడా క్రాష్ అయ్యాయి.
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఆకాశ, స్పైస్‌జెట్, విస్తారా వంటి ప్రముఖ విమానయాన సంస్థల సర్వీసులపై దీని ప్రభావం పడింది. సాంకేతిక కారణాల వల్ల బుకింగ్, చెక్-ఇన్, బోర్డింగ్ పాస్ ఇష్యూయింగ్, ఫ్లైట్ స్టేటస్ చెకింగ్ వంటి సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఒక్క ఇండిగో విమానయాన సంస్థే 200కు పైగా విమాన సేవలను నిలిపేసింది. ఇక, బెంగళూరు ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 1 గుండా ప్రయాణం సాగిస్తున్న 90 శాతం ఫ్లైట్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లోని ఫ్లైట్ ఆపరేషన్లలో అడ్డంకులు కలిగాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు, ఆస్పత్రిల్లోనూ సేవల్లో అంతరాయం ఏర్పడినట్టు నెటిజన్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ 365, మైక్రోసాఫ్ట్ టీమ్, మైక్రోసాఫ్ట్ అజుర్ సర్వీసులతో పాటు ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్, జీమెయిల్ సర్వీసుల్లో సమస్యలు ఎదుర్కొన్నట్టు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE