దేశంలో ఒక్కరోజులోనే 620 ఒమిక్రాన్ కేసులు, 5 వేలు దాటిన మొత్తం కేసుల సంఖ్య

Coronavirus, Coronavirus Cases, coronavirus cases in india state wise, coronavirus cases in india today state wise, coronavirus cases india, COVID-19, COVID-19 Cases in India, covid-19 new variant, India 620 Positive Cases in Last 24 hours Total Tally Reaches to 5488, India Omicron Cases, India Reports 6563 Covid-19 Cases in Last 24 Hours, Mango News, Mango News Telugu, New coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, Omicron, Omicron Cases In India, Omicron covid variant, Omicron variant, omicron variant in India, Update on Omicron

దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5 వేలు (5,488) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది. బుధవారం ఉదయానికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4868 ఉండగా, ఒక్కరోజు వ్యవధిలోనే కొత్తగా 620 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 5,488కు చేరింది. దేశంలో ఇప్పటికి 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవగా, అత్యధికంగా మహారాష్ట్రలో 1,367, రాజస్థాన్ లో 792, ఢిల్లీలో 549 నమోదయ్యాయి. కాగా మొత్తం 5488 బాధితుల్లో ఇప్పటికే 2,162 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.

దేశంలో ఒమిక్రాన్ కేసుల వివరాలు (5488):

  1. మహారాష్ట్ర – 1,367
  2. రాజస్థాన్ – 792
  3. ఢిల్లీ – 549
  4. కేరళ – 486
  5. కర్ణాటక – 479
  6. వెస్ట్ బెంగాల్ – 294
  7. ఉత్తర్ ప్రదేశ్ – 275
  8. తెలంగాణ – 260
  9. గుజరాత్ – 236
  10. తమిళనాడు – 185
  11. ఒడిశా – 169
  12. హర్యానా – 162
  13. ఆంధ్రప్రదేశ్ – 61
  14. మేఘాలయ – 31
  15. బీహార్ – 27
  16. పంజాబ్ – 27
  17. జమ్మూ కాశ్మీర్ – 23
  18. గోవా – 21
  19. మధ్యప్రదేశ్ – 10
  20. అస్సాం – 9
  21. ఉత్తరాఖండ్ – 8
  22. ఛత్తీస్ గడ్ – 5
  23. అండమాన్ అండ్ నికోబార్ – 3
  24. చండీఘర్ – 3
  25. లద్దాఖ్ – 2
  26. పుదుచ్చేరి – 2
  27. హిమాచల్ ప్రదేశ్ – 1
  28. మణిపూర్ – 1

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =