ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ : వర్షం వలన నాలుగో రోజు ఆట పూర్తిగా రద్దు

2021 WTC, BCCI WTC21 Final, Ind Vs Eng 2021 India Squad For WTC Final And Test Series, IND vs NZ WTC Final 2021, IND vs NZ WTC Final HIGHLIGHTS, India Squad For WTC Final 2021, India vs New Zealand, India vs New Zealand Live Score, India vs New Zealand WTC Final, India Vs New Zealand WTC Final 2021, Mango News, Play on Day 4 has been Called off Due to Rains, WTC 2021, WTC 2021 Final, WTC Final India vs New Zealand

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యుటీసీ) ఫైనల్ మ్యాచ్ లో వర్షం కారణంగా నాలుగో రోజు ఆట కూడా పూర్తిగా రద్దు చేయబడింది. సౌథాంప్టన్‌ లో సోమవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉండడంతో ముందుగా తోలి సెషన్ ఆట జరగలేదు. సాయంత్రం 7:30 గంటల సమయంలో స్టేడియంలో పరిస్థితులను అంపైర్లు మరోసారి పరిశీలించి నాలుగో రోజు ఆటను రద్దు చేస్తునట్టు ప్రకటించారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇప్పటికే తొలిరోజు కూడా ఒక్క బాల్ పడకుండానే ఆట రద్దయిన సంగతి తెలిసిందే.

మరోవైపు భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (49), కెప్టెన్ విరాట్ కోహ్లీ (44) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్ జేమిసన్ 5 వికెట్లతో రాణించాడు. ఇక మూడో రోజు తోలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేయగా, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(12), రాస్‌టేలర్‌(0) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ ఓపెనర్లు డేవాన్‌ కాన్వే(54) టామ్‌ లాథమ్‌(30) పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. మరోవైపు జూన్ 23న రిజర్వ్ డే తో కలుపుకొని రెండు రోజులే ఉండడం, ఇంకా వర్షం ప్రభావం పడే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్‌ డ్రాగా ముగుస్తోందా లేదా ఏవైనా సంచనాలు నమోదవుతాయా వేచి చూడాలి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 9 =