ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ గురువారం ఢిల్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అతిషి, సౌరభ్ భరద్వాజ్ ల చేత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పలువురు పార్టీ నేతలు పాలొన్నారు. కాగా అతిషికి విద్య, పీడబ్ల్యూడి, పవర్ మరియు టూరిజం శాఖలను కేటాయించారు. అలాగే సౌరభ్ భరద్వాజ్ కు ఆరోగ్యం, వాటర్, పరిశ్రమలు మరియు పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు.
ముందుగా ఇటీవలే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా, మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయి తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్న సత్యేంద్ర జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెంటనే ఆమోదించారు. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామాల తర్వాత, ఢిల్లీ ప్రభుత్వంలో రెండు కేబినెట్ బెర్త్‌లు ఖాళీ అయ్యాయి. వీరి స్థానంలో అతిషి మరియు భరద్వాజ్‌ల పేర్లను కేబినెట్ మంత్రులుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ సిఫార్సు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం అనంతరం గురువారం అతిషి, సౌరభ్ భరద్వాజ్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. మరోవైపు మార్చి 17 నుంచి ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE