500 కి.మీ పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర.. మదనపల్లిలో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్

TDP Leader Nara Lokesh Unveils Stone-Slab at Madanapalle During Yuva Galam Padayatra Crosses 500 kms Mark,TDP Leader Nara Lokesh,Nara Lokesh Unveils Stone-Slab,TDP Leader Nara Lokesh at Madanapalle,Yuva Galam Padayatra Crosses 500 kms Mark,Mango News,Mango News Telugu,Nara Lokesh Yuva Galam Padayatra,Nara Lokesh500,Padayatra Crosses 500 KM Mark,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Nara Lokesh Padayatra Latest Updates

టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గురువారం ఆయన మదనపల్లి సీటీఎం దగ్గర ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు పలువురు పాల్గొన్నారు. కాగా ప్రస్తుతం మదనపల్లి నియోజకవర్గంలో నారా లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతుండగా.. నేడు 39వ రోజుకు చేరుకుంది. ఇక ప్రతి వంద కిలోమీటర్లకు స్థానిక ప్రజా అవసరాలను తీర్చేలా పటిష్ట హామీ ఇస్తున్న లోకేష్, పాదయాత్ర 500 కి.మీ. చేరుకున్న సందర్భంగా ఈరోజు ఏపీలోని టమోటా రైతులకు ఒక హామీ ఇచ్చారు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా, చిన్న తిప్పసముద్రం వద్ద టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని, అలాగే పంటను నిల్వ చేసేందుకు ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేస్తామని టమోటా రైతులకు లోకేష్ వాగ్దానం చేశారు.

అలాగే చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన నారా లోకేష్.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పవర్ లూమ్ రంగానికి అందిస్తున్న 500 యూనిట్స్ విద్యుత్ ఎత్తేశారని, వైఎస్సార్ బీమా ఏం చేశారు? అని ప్రశ్నించారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, సబ్సిడీ మొత్తం ఏం చేశారని? నిలదీశారు. 63 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టించు కోలేదని, చేనేత కార్మికులకు గుర్తింపు లేదని మండిపడ్డ లోకేష్.. బీసీ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం లేదని, జీఎస్టీతో నేతన్నలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. వారిని కేవలం రాజకీయంగా మాత్రమే వాడుకుంటున్నారని, వారికి వెంటనే G+3 ఇళ్లు, మగ్గాలకు ప్రత్యేక సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులను రియల్ టైం టెక్నాలజీతో ఆదుకుంటామని, పింఛన్లు అందిస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =