భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ధరపై నిర్ణయం, ప్రభుత్వానికి రూ.325, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.800

Bharat Biotech Announces Price of Covid Nasal Vaccine, Vaccine Rs 800 Per Dose for Private Hospitals, Vaccine Rs 325 for Central State Govts, Mango News, Mango News Telugu, Bharat Biotech Vaccine, Bharat Biotech Covid Nasal Vaccine, Bharat Biotech Nasal Vaccine Cost, Bharat Bio Nasal Vaccine, Nasal Covid vaccine, Bharat Biotech announces vaccine price, Covid Nasal Vaccine Pricing Out

దేశంలో ప్రికాషన్/బూస్టర్ డోస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్-బీబీవి154 (ఇన్కోవాక్‌) ను 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కోవిడ్-19 బూస్టర్ డోస్‌గా పరిమితులతో కూడిన అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్కోవాక్‌ వ్యాక్సిన్ ధరపై భారత్ బయోటెక్ సంస్థ తాజాగా ఒక ప్రకటన చేసింది.

ముక్కు ద్వారా తీసుకునే ఈ ఇన్కోవాక్‌ వ్యాక్సిన్ ను కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసుకు రూ.325 చొప్పున మరియు ప్రైవేట్ ఆసుపత్రులు/ప్రైవేట్ మార్కెట్స్ కు ఒక్కో డోసుకు రూ.800 చొప్పున విక్రయించనున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. కాగా ప్రైవేట్ ఆసుపత్రులలో 5 శాతం జీఏస్టీ, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీగా రూ.150 కలిపితే ఒక్కో డోస్‌కు దాదాపు రూ.1,000 ధర అయ్యే అవకాశముంది.
కొవిన్‌ యాప్‌ ద్వారా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కోవాక్జిన్ లేదా కోవిషీల్డ్‌ రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారు, బూస్టర్ డోస్ కింద ఈ ఇన్కోవాక్‌ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కాగా జనవరి నెల చివరి వారంలో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఇన్కోవాక్‌ వ్యాక్సిన్ అందుబాటులోకి రానునట్టు తెలుస్తుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 15 =