ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు.. రాకేష్ రెడ్డికి జీవిత ఖైదు

Hyderabad Nampally Court Sentenced Rakesh Reddy To Life Imprisonment in industrialist and NRI Chigurupati Jayaram Assassination Case,Hyderabad Nampally Court Sentenced Rakesh Reddy,Rakesh Reddy Life Imprisonment in industrialist Case,NRI Chigurupati Jayaram Assassination Case,Rakesh Reddy in Jayaram Assassination Case,Mango News,Mango News Telugu,Rakesh Reddy gets life imprisonment,NRI murder in Hyderabad,NRI industrialist Chigurupati Jayaram murder,Hyderabad News,Telangana News Today,Telangana News Today,Telangana Latest News and Updates

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్‌ఆర్‌ఐ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు కె రాకేష్ రెడ్డిని నాంపల్లి సెషన్స్ కోర్టు ఇటీవల దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రాకేష్ రెడ్డికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ మేరకు మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కె. కుషా, రాకేష్ రెడ్డిని హత్య మరియు క్రూరత్వానికి సంబంధించిన అభియోగాలలో దోషిగా నిర్ధారించారు. 2019 నాటి ఈ కేసులో సుమారు నాలుగేళ్ళ పాటు మొత్తం 73 మంది సాక్షులను విచారించిన కోర్టు సాక్ష్యాలను పరిశీలించి, వాదనలు విన్న తర్వాత కుట్ర చేసి హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు 23 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు పోలీసు అధికారులతో సహా మిగిలిన 11 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

కాగా 2019 జనవరిలో ఎన్‌ఆర్‌ఐ చిగురుపాటి జయరామ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో ఆయన మృతదేహం ఒక కారులో లభ్యమైంది. నిందితులు ఆయన మృతదేహంతో పాటు కారును కూడా రోడ్డు పక్కనే వదిలేశారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే వ్యాపారి హత్యకు గురైనట్లు ఆరోపణలు రాగా.. కేసును పరిశోదించిన పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసి షాకింగ్ నిజాలు బయటపెట్టారు. రాకేష్ రెడ్డితో సహా మరో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నిందితుల జాబితాలో ముగ్గురు పోలీసు అధికారులు కూడా ఉండటం విశేషం. అప్పటి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లా రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు మరియు రాంబాబుల ప్రమేయం ఉన్నట్లు తెలియజేశారు. వారి సలహా మేరకే ప్రధాన నిందితుడు జయరామ్ మృతదేహాన్ని నందిగామ పోలీస్ స్టేషన్ పరిధికి తరలించి ప్రమాద ఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని విచారణ జరిపిన పోలీసులు తేల్చారు. అప్పటినుంచి దీనిపై నాంపల్లి సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =