కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే గెలుపు ఖాయం కాగా.. ఈసీ అధికారిక ప్రకటన లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? సీఎం పదవిని ఎవరు చేపట్టనున్నారు? అనే ఆసక్తికర చర్చ రాష్రావ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. మీడియాలో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరోవైపు పార్టీలో కూడా నేతలు, కార్యకర్తలు దీనిపై అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దీనిపై స్పందించారు. ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరికి అప్పగించాలనే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
అధిష్టానం ఎవరిని సూచించినా.. అందరూ సమ్మతం తెలుపుతారని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదిలా ఉండగా రేపు (ఆదివారం, మే 14, 2023) కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా సీఎం పదవి కోసం సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య మరియు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకొనే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఖాయమని తేలిన నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ రోజు సాయంత్రమే తన పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేయవచ్చని సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE