మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోన్న కరోనా

Corona Spreading Like Water Under the Carpet Again,Corona Spreading Like Water,Water Under the Carpet Again,Corona, JN1 Variant, covid19, news covid cases,Mango News,Mango News Telugu,Coronavirus Survive on Carpet,Corona Latest News,Corona Latest Updates,21 cases of new corona variant,Coronavirus disease,Coronavirus Statistics,India Fights Corona,Corona Virus Latest News,Corona Virus Latest Updates
Corona, JN1 Variant, covid19, news covid cases

కరోనా.. ఈ పేరు వింటేనే భయం పుట్టుకొస్తుంది. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యాలను కూడా వదలకుండా అల్లకల్లోలం చేస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో ఆరు నెలలకోసారి వచ్చి విళయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు ప్రశాంతంగా ఊపిరి తీసుకున్న జనాలకు.. కొత్త వేరియంట్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్1 చాపకింద నీరులా వ్యాపిస్తోంది. పలు దేశాల్లో కేసులు భారీగా నమోదవుతుండడంతో పాటు.. భారత్‌లో కూడా రోజురోజుకు కొత్త వేరియంట్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జేఎన్1 వేరియంట్ పట్ల అప్రమత్తమయింది. రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది. పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. మొన్నటి వరకు దేశంలో సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. గడిచిన మూడు, నాలుగు రోజులుగా కేసులు పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటకలో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. అటు అమెరికా, చైనా, సింగపూర్ దేశాల్లో కూడా జేఎన్1 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 614 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో కేరళలో ముగ్గురు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే 21 తర్వాత దేశంలో ఒక్క రోజులో ఇన్ని కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2311 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. అలాగే కొత్త వేరియంట్ బారిన పడిన వారిలో 92 శాతం మంది ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారని అన్నారు.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వారంతా ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. అటు వైద్యులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెరుగుతున్న కేసులతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తలు పాటిస్తే మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 5 =