దేశంలో సామాన్యులకు మరో షాక్ తగలనుంది. రేపటి నుంచి రెండు ప్రముఖ పాల బ్రాండ్స్ ధరలు పెరగనున్నాయి. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ బ్రాండ్ పేరుతో పాలు మరియు పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమూల్ బ్రాండ్ పాల ధరలను లీటరుకు రూ.2 పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ ధర పెంపు రేపటి నుంచే (ఆగస్టు 17, బుధవారం) అమల్లోకి రానుంది. అహ్మదాబాద్, సౌరాష్ట్ర, ఢిల్లీ-ఎన్సీఆర్, వెస్ట్ బెంగాల్, ముంబయి మరియు ఇతర అన్ని మార్కెట్‌లలో అమూల్ పాల ధరలు లీటరుకు రూ.2 పెరగనున్నాయి. నిర్వహణ వ్యయం పెరుగుదల మరియు పాల ఉత్పత్తి కారణంగానే ధరలను పెంచుతున్నట్టు అమూల్ ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే కేవలం పశువుల దాణా ఖర్చే సుమారు 20 శాతానికి పెరిగిందన్నారు. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే, అమూల్ సభ్య సంఘాలు కూడా రైతుల ధరలను గత ఏడాదిన 8-9 శాతం వరకు పెంచాయని పేర్కొన్నారు.
మరోవైపు మదర్ డెయిరీ కూడా పాల ధరను లీటరుకు రూ.2 పెంచింది. ఆగస్టు 17 నుండి పెరిగిన ధర అమల్లోకి వస్తుందని, కొత్త ధరలు అన్ని పాల రకాలకు వర్తిస్తాయని మదర్ డెయిరీ పేర్కొంది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతోనే ధర పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మదర్ డెయిరీ గత మార్చిలో చివరిగా ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో తమ బ్రాండ్స్ పాల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY