భారత్ vs జింబాబ్వే వన్డే సిరీస్‌: గాయంతో వాషింగ్టన్ సుందర్ దూరం, అతని స్థానంలో షాబాజ్ అహ్మద్‌

BCCI Announces Shahbaz Ahmed Replaces Injured Washington Sundar for Zimbabwe Series, Shahbaz Ahmed Replaces Injured Washington Sundar for Zimbabwe Series, Washington Sundar, Shahbaz Ahmed, Board of Control for Cricket in India, Zimbabwe Series, India VS Zimbabwe, India VS Zimbabwe ODI Series, India vs Zimbabwe 2022 Schedule, India VS Zimbabwe ODI Series News, India VS Zimbabwe ODI Series News And Updates, India VS Zimbabwe ODI SeriesLive Updates, Mango News, Mango News Telugu,

ఆగస్టు 18, 20, 22 తేదీల్లో భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత్ జట్టులో తాజా మార్పుపై బీసీసీఐ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. జింబాబ్వేతో జరగనున్న వన్డే సిరీస్‌కు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడని తెలిపారు. ఇంగ్లాండ్ లో కౌంటీ గేమ్ ఆడుతున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ భుజానికి గాయమవడంతో జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడని తెలిపారు. దీంతో వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టులోకి ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఆగస్టు 18న హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో భారత్ తొలి వన్డే ఆడనుంది. ఈ సిరీస్ కు భారత కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్, అలాగే శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.

జింబాబ్వేతో 3 వన్డేలకు భారత్ జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, షాబాజ్ అహ్మద్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 19 =