గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022: మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ, ముఖ్యాంశాలు ఇవే…

Gujarat Assembly Elections-2022: BJP Manifesto Released By JP Nadda CM Bhupendra Patel,Gujarat Assembly Elections-2022, Manifesto Announced by BJP,BJP Manifesto Released By JP Nadda, CM Bhupendra Patel,Mango News,Mango News Telugu,Narendra Modi,Gujarat , Gujarat Assembly Elections,Assembly Elections In Gujarat, Gujarat Assembly Poll,PM Narendra Modi, Modi Latest News And Updates,Gujarat Assembly News And Live Updates,

గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మేనిఫెస్టోను విడుదల చేసింది. శనివారం గాంధీనగర్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో ద్వారా గుజరాత్ ప్రజలపై అధికార బీజేపీ వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలో 20 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన, యూనిఫాం సివిల్ కోడ్ అమలు, యాంటీ రాడికలైజేషన్ సెల్‌ ఏర్పాటు సహా పలు హామీలను జేపీ నడ్డా ప్రకటించారు.

ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, గుజరాత్‌ను మార్పు తీసుకొచ్చే వ్యక్తుల తయారీ భూమిగా పేర్కొన్నారు. గుజరాత్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రస్తావిస్తూ, గుజరాత్ దేశానికి రాజకీయ దిశానిర్దేశం చేసిందని అన్నారు. అలాగే గుజరాత్ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో సమానంగా మారుస్తామని జేపీ నడ్డా ప్రకటించారు. మరోవైపు గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. గుజరాత్ లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ మొదటి దశలో భాగంగా డిసెంబర్ 1న 89 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో భాగంగా డిసెంబర్ 5న 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022: బీజేపీ మేనిఫెస్టో లో ముఖ్యాంశాలు ఇవే…

  • యూనిఫాం సివిల్ కోడ్ అమలు
  • రాష్ట్రంలో 20 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన
  • మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
  • రైతు మౌలిక సదుపాయాలకు(అగ్రి-మార్కెటింగ్) రూ.10,000 కోట్లు
  • ఉగ్రవాద సంస్థల బెదిరింపులు, స్లీపర్ సెల్‌లను గుర్తించి, తొలగించడానికి యాంటీ రాడికలైజేషన్ సెల్‌ ఏర్పాటు
  • బ్లూ ఎకానమీ ఇండస్ట్రీస్ కారిడార్ ఏర్పాటు
  • మహిళలకు, వృద్దులకు ఉచిత బస్సు ప్రయాణం
  • విద్యార్థినిలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
  • ఈడబ్ల్యూఎస్/ఓబీసీ విద్యార్థులకు ఆర్థిక సహాయం
  • రాష్ట్రంలో ఒలింపిక్ క్రీడల నిర్వహణ యత్నాలు
  • రూ.10,000 కోట్లతో రాష్ట్రంలో స్కూల్స్ అభివృద్ధి
  • దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రలో రెండు సీఫుడ్ పార్కులు
  • నీటిపారుదల సౌకర్యాల కోసం రూ.25,000 కోట్లు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 13 =