దేశంలో ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్: జ‌నాభా, కేసుల తీవ్ర‌త ఆధారంగా వ్యాక్సిన్స్ కేటాయింపు

Centre Released Revised guidelines on Covid Vaccination, Centre Released Revised guidelines on Covid Vaccination Free Vaccines for States Based on Population, Coronavirus vaccine will be allocated to states, Covid Vaccination Guidelines, Covid-19 Vaccination, Free Vaccines for States Based on Population, GOI releases revised guidelines, Govt releases revised guidelines, Mango News, New Covid-19 vaccination guidelines, New Covid-19 vaccination guidelines out

దేశంలో కేంద్రీకృత ఉచిత వ్యాక్సినేషన్ విధానం కింద అన్ని వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అన్ని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తామని సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 21 తేదీ నుంచి దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలివే:

  • దేశంలో ఉత్పత్తి అయ్యే కరోనా వ్యాక్సిన్లలో 75శాతం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందిస్తుంది. రాష్ట్రాలు ప్రాధాన్యత ఆధారంగా ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో ప్రజలకు ఉచితంగా అందించాలి.
  • వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యత క్రమం: 1.హెల్త్ వర్కర్స్, 2.ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 3.45 ఏళ్లు పైబడినవారు, 4.రెండో డోసు కోసం వేచిఉన్న వారు, 5.18ఏళ్ల పైబడినవారు.
  • 18 ఏళ్లుకు పైబడినవారికి సంబంధించి కరోనా వ్యాక్సినేషన్ షెడ్యూల్ కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలే తమ సొంత ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకోవచ్చు.
  • రాష్ట్ర జనాభా, కరోనా వ్యాధి తీవ్రత మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమం పురోగతి వంటి ప్రమాణాల ఆధారంగా రాష్ట్రాలకు ఉచిత వ్యాక్సిన్స్ కేటాయించబడతాయి.
  • రాష్ట్రాల్లో జరిగే వ్యాక్సిన్ వృధా, కేటాయింపుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
  • రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్ల అందజేతపై కేంద్రం నుంచి ముందస్తు సమాచారం ఇవ్వబడుతుంది. ఇక రాష్ట్రాలు కూడా జిల్లాలు, వ్యాక్సిన్‌ కేంద్రాలకు ముందుగానే అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ డోసుల వివరాలు పంపించి, ఆ సమాచారాన్ని వ్యాక్సినేషన్ సెంటర్లలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
  • వ్యాక్సిన్ తయారీదారుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, కొత్త వ్యాక్సిన్లను ప్రోత్సహించడానికి, దేశీయ వ్యాక్సిన్ తయారీదారులకు నేరుగా ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్లను అందించే అవకాశం ఇవ్వబడుతుంది. సంస్థల నెలవారీ ఉత్పత్తిలో 25% ప్రైవేటుకు ఇచ్చేలా పరిమితం చేయబడుతుంది.
  • ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్ డోసుల ధరను, వ్యాక్సిన్ తయారీదారు సంస్థ ప్రకటిస్తుంది. తదుపరిగా ఏమైనా మార్పులు ఉంటే ముందుగానే తెలియజేయబడతాయి. ప్రైవేట్ ఆసుపత్రులు సర్వీస్ ఛార్జీలుగా ఒక్కో డోసుకు గరిష్టంగా రూ.150 వరకు వసూలు చేయవచ్చు.
  • దేశ పౌరులందరూ వారి ఆదాయ స్థితితో సంబంధం లేకుండా ఉచిత వ్యాక్సిన్ పొందడానికి అర్హులు.
  • కొవిన్‌ వెబ్ సైట్ తో పాటుగా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలి.
  • ఇక ప్రజలకు ముందస్తు అప్పోయింట్మెంట్ ను సులభతరం చేసేందుకు కామన్ సర్వీస్ సెంటర్లు మరియు కాల్ సెంటర్లను కూడా రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు.
  • ఈ సవరించిన మార్గదర్శకాలు అన్ని జూన్ 21 నుంచి అమల్లోకి వస్తాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 13 =