అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ కు కరోనా పాజిటివ్

Arunachal Pradesh CM, Arunachal Pradesh CM Pema Khandu, Arunachal Pradesh CM Pema Khandu Tests Positive, CM Pema Khandu Tests Positive, Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, COVID-19, Pema Khandu

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్ష చేయించుకున్నాను. ఫలితం పాజిటివ్ గా వచ్చింది. ఎటువంటి కరోనా లక్షణాలు లేవు, నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. అయితే కరోనా నిబంధనలు మరియు ఇతరుల భద్రతా దృష్ట్యా సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నాను. నాతో సంప్రదించిన ప్రతి ఒక్కరినీ కరోనా నిబంధనలకు కట్టుబడి ఉండమని అభ్యర్థిస్తున్నాను” అని సీఎం పెమా ఖండూ ట్వీట్ చేశారు. దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కర్ణాటక సీఎం యడియూరప్ప, హర్యానా ‌సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడి, చికిత్స అనంతరం కోలుకున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu