దేశంలో ఏటీఎంల నిర్వహణ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే బ్యాంకులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది. ఏటీఎంలలో ఒక నెలలో 10 గంటలకు మించి నగదు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడితే ఆ ఏటీఎం నిర్వహించే బ్యాంకుకు రూ.10,000 చొప్పున జరిమానా విధించబడుతుందని తెలిపారు. ఎన్ని ఏటీఎంలలో ఇలాంటి పరిస్థితి ఉన్న అన్ని చోట్ల రూ.10,000 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబరు 1, 2021 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
నగదు లేకపోవడం కారణంగా ఏటీఎంలు పని చేయకపోవడంపై ఆర్‌బీఐ సమీక్ష జరిపింది. నగదు అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని గమనించామని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు లేదా వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఏటీఎంలలో నగదు లభ్యతను పర్యవేక్షించడానికి వారి వ్యవస్థలను, యంత్రాంగాలను బలోపేతం చేయాలని సూచించారు. నగదు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా నిర్ధారణ చేసుకోవాలని, ఈ విషయంలో నిబంధనలు పాటించకపోతే తీవ్రంగా పరిగణించబడుతుందని, జరిమానా విధించబడుతుందని తెలిపారు. అలాగే వైట్ లేబుల్ ఏటిఎంల విషయంలో పెనాల్టీని నిర్దిష్ట వైట్ లేబుల్ ఏటీఎం యొక్క నగదు అవసరాలను తీర్చే బ్యాంకు ద్వారా వసూలు చేయబడుతుందని, బ్యాంక్ కావాలనుకుంటే వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ నుండి చెల్లించిన జరిమానాను తిరిగి పొందవచ్చని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ