జాతీయ క్రీడా అవార్డులు-2022: శరత్ కమల్ ఆచంటకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, నిఖత్ జరీన్, శ్రీజకు అవార్డులు

National Sports Awards 2022 Announced Sharath Kamal Achanta Awarded Major Dhyan Chand Khel Ratna Award,National Sports Awards 2022, Major Dhyan Chand Khel Ratna, Sarath Kamal Achanta, Nikhat Zareen, Sreeja,Mango News,Mango News Telugu,Achanta Sharath Kamal,Major Dhyan Chand Khel Ratna Award,Veteran Table Tennis Player,National Sports Awards,Khel Ratna for Achanta Sharath,Ministry of Youth Affairs & Sports,Sports Awards In India 2022,Dhyan Chand Award,Dhyan Chand Award 2022

భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. 2022 సంవత్సరానికి గానూ జాతీయ క్రీడా అవార్డులు-2022లో భాగంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, ద్రోణాచార్య, అర్జున, ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు సహా పలు ఇతర అవార్డులు దక్కించుకున్న ఆటగాళ్లు, కోచ్ లు, సంస్థల పేర్లను ప్రకటించారు. ఈ ఏడాది క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ ఆచంటను వరించింది.

ద్రోణాచార్య లైఫ్ టైమ్ కేటగిరిలో ముగ్గురికి, రెగ్యులర్ కేటగిరిలో నలుగురికి, ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను నలుగురుకి, అర్జున అవార్డులను 25 మందికి, మూడు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్-2022, ఒక మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ-2022ను ప్రకటించారు. ఇక అవార్డు గ్రహీతలు నవంబర్ 20న సాయంత్రం 4.00 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి వారి అవార్డులను అందుకోనున్నారు.

జాతీయ క్రీడా అవార్డులు-2022:

  • మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2022: ఆచంట శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్)

ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీ:

  • జీవన్‌జోత్ సింగ్ తేజా (ఆర్చరీ)
  • మహమ్మద్ అలీ కమర్ (బాక్సింగ్)
  • సుమా సిద్ధార్థ్ షిరూర్ (పారా షూటింగ్)
  • సుజీత్ మాన్ (రెజ్లింగ్)

ద్రోణాచార్య లైఫ్ టైమ్ కేటగిరి:

  • దినేష్ జవహర్ లాడ్ (క్రికెట్)
  • బిమల్ ప్రఫుల్ల ఘోష్ (ఫుట్‌బాల్)
  • రాజ్ సింగ్ (రెజ్లింగ్)

ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు:

  • అశ్విని అక్కుంజి సి (అథ్లెటిక్స్)
  • ధరమ్వీర్ సింగ్ (హాకీ)
  • బీసీ సురేష్ (కబడ్డీ)
  • నిర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్)

అర్జున అవార్డు:

  • సీమా పునియా (అథ్లెటిక్స్)
  • ఎల్దోస్ పాల్ (అథ్లెటిక్స్)
  • అవినాష్ ముకుంద్ సేబుల్ (అథ్లెటిక్స్)
  • లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్)
  • హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్)
  • అమిత్ (బాక్సింగ్)
  • నిఖత్ జరీన్ ( బాక్సింగ్)
  • భక్తి ప్రదీప్ కులకర్ణి (చెస్)
  • ఆర్.ప్రజ్ఞానంద (చెస్)
  • దీప్ గ్రేస్ ఎక్కా (హాకీ)
  • శుశీలా దేవి (జూడో)
  • సాక్షి కుమారి (కబడ్డీ)
  • నయన్ మోని సైకియా (లాన్ బౌల్)
  • సాగర్ కైలాస్ ఓవల్కర్ (మల్లాఖాంబ్)
  • ఇలవెనిల్ వలరివన్ (షూటింగ్)
  • ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్)
  • శ్రీజ అకుల (టేబుల్ టెన్నిస్)
  • వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్)
  • అన్షు (రెజ్లింగ్)
  • సరిత (రెజ్లింగ్)
  • పర్వీన్ (వుషు)
  • మానసి గిరీశ్చంద్ర జోషి (పారా బ్యాడ్మింటన్)
  • తరుణ్ ధిల్ (పారా బ్యాడ్మింటన్)
  • స్వప్నిల్ సంజయ్ పాటిల్ (పారా స్విమ్మింగ్)
  • జెర్లిన్ అనికా జె (డెప్ బ్యాడ్మింటన్).

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2022:

  • ట్రాన్స్‌స్టాడియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్
  • కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ
  • లడఖ్ స్కీ అండ్ స్నోబోర్డ్ అసోసియేషన్.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ (ఎంఏకేఏ) ట్రోఫీ 2022: గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్‌సర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =