ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023/ఐపీఎల్ 16వ సీజన్ నిర్వహణకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం విడుదల చేసింది. మార్ఛి 31వ తేదీన తోలి మ్యాచ్ తో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 31న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్-2022 విజేత గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ తో క్రీడాభిమానులకు అత్యంత ఇష్టమైన ఐపీఎల్ సంబరం మొదలు కానుంది.
2023, ఏప్రిల్ 1న సీజన్‌లో మొదటి డబుల్-హెడర్ రోజు కాగా, పంజాబ్ కింగ్స్ మొహాలిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మరియు లక్నో సూపర్ జెయింట్స్ లక్నోలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచులు మధ్యాహ్నం 3:30 గంటలకు (డే గేమ్‌లు), రాత్రి 7.30 గంటలకు (సాయంత్రం గేమ్‌లు) జరగనున్నాయి. గ్రూప్ ఏ లో ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉండగా, గ్రూప్ బిలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి.
గత ఐపీఎల్ ఎడిషన్ ముంబయి, పూణె మరియు అహ్మదాబాద్‌లలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ యొక్క 16వ సీజన్ గతంలో లాగా హోమ్ మరియు అవే ఫార్మాట్ జరుగుతుందని, ఈ ఫార్మాట్ లో అన్ని జట్లు లీగ్ దశలో వరుసగా 7 హోమ్ గేమ్‌లు మరియు 7 అవే గేమ్‌లను ఆడతాయని బీసీసీఐ పేర్కొంది. 52 రోజుల పాటు అహ్మదాబాద్, మొహాలి, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబయి, గౌహతి, ధర్మశాల వంటి 12 వేదికలపై మొత్తం 70 లీగ్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ 2023లో 18 డబుల్ హెడర్‌లు ఉండనున్నాయి. కాగా రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి రెండు హోమ్ గేమ్‌లను గౌహతిలో ఆడనుందని, మిగిలిన హోమ్ గేమ్స్ జైపూర్‌లో ఆడుతుందని తెలిపారు.
అలాగే పంజాబ్ కింగ్స్ తమ మొదటి ఐదు హోమ్ మ్యాచ్ లను మొహాలీలో ఆడుతుందని, ఆపై తమ చివరి రెండు హోమ్ మ్యాచ్‌లను ధర్మశాలలో వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాజస్థాన్ రాయల్స్‌తో ఆడుతుందని బీసీసీఐ ప్రకటించింది. మే 21తో లీగ్ మ్యాచ్‌లు ముగియనుండగా, ప్లేఆఫ్‌లు మరియు ఫైనల్‌ల షెడ్యూల్, అవి నిర్వహించే వేదికల వివరాలను తర్వాత ప్రకటించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. ఫైనల్, మరియు ప్లేఆఫ్ ల షెడ్యూల్ తర్వాత ప్రకటించబడుతుందని బీసీసీఐ ప్రకటించింది.
— IndianPremierLeague (@IPL) February 17, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE