తెలంగాణకు మెడికల్‌ కాలేజీల మంజూరుపై కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు – మంత్రి కేటీఆర్‌

Minister KTR Says Three Union Ministers Speaking Different on Same Topic Regarding The Medical Colleges in Telangana,Union Ministers Speaking Differently,Grant Of Medical Colleges To Telangana,Telangana Minister Ktr,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్రానికి మెడికల్‌ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రులుఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని, అది కూడా ఒకే విషయాన్ని ముగ్గురు మంత్రులు వేర్వేరుగా చెబుతున్నారని తెలిపారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు. ఈ మేరకు ఆయన దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రధానమంత్రిని ఉద్దేశించి, ‘మోదీ జీ.. కనీసం మీ మంత్రులందరికి ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా ట్రెయినింగ్‌ ఇవ్వండి’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఇంకా ఇలా అన్నారు.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పేదాని ప్రకారం.. తెలంగాణకు 9 మెడికల్‌ కాలేజీలు మంజూరయ్యాయని, అయితే మరో మంత్రి మన్సూక్ మాండవీయ మాత్రం మెడికల్‌ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదంటున్నారని తెలిపారు. ఇక ఇదే విషయంపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి కేవలం రెండు ప్రతిపాదనలే వచ్చాయని అంటున్నారని, ఇలా కేంద్ర కేబినెట్ మంత్రులే ఒకే విషయంపై పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. అలాగే తెలంగాణలో లేని 9 మెడికల్‌ కాలేజీలు ఉన్నట్లుగా చూపిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, అబద్ధాలు చెప్పిన ముగ్గురిలో గొప్ప మేథావి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + twenty =