న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. కాంబోజ్ త్వరలో ఈ అసైన్‌మెంట్‌ను చేపట్టనుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపింది. టీఎస్ తిరుమూర్తి తర్వాత ఆమె UNలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా కాంబోజ్, 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారిణి. ప్రస్తుతం ఆమె భూటాన్‌లో భారత మొదటి మహిళా రాయబారిగా పనిచేస్తున్నారు. 1987 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా మహిళా టాపర్ మరియు 1987 ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌లో కూడా ఆమే టాపర్.
డిసెంబరు 2014లో సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ బ్లూ రిబ్బన్ ప్యానెల్ నివేదికను విడుదల చేసిన తర్వాత, ఆమె ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణ మరియు విస్తరణపై పనిచేసిన G-4 బృందంలో పనిచేశారు. 2006-2009 వరకు, ఆమె దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో భారత కాన్సుల్ జనరల్‌గా ఉన్నారు, ఈ పదవిలో దక్షిణాఫ్రికా పార్లమెంట్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కాలంలో 2008లో భారత రాష్ట్రపతి కేప్ టౌన్ పర్యటనలకు మరియు 2007లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కేప్ టౌన్ పర్యటనకు కూడా ఆమె నాయకత్వం వహించారు. ఈ పర్యటనకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం రాష్ట్ర పర్యటన హోదాను కల్పించింది. కాగా రుచిరా కాంబోజ్ వ్యాపారవేత్త దివాకర్ కాంబోజ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీలో అధికారిగా పనిచేశారు. ఆమె తల్లి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY