ఇట్స్ అఫీషియల్.. రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ

Tamil actor Vijay, Thalapathy Vijay, political party, Tamilnadu, Tamilaga Vetri Kazhagam, tamil News Updates, Vijay new party, Politics, Political Entry, popular Tamil actor, Tamil Nadu politics, Kollywood, Kollywood film industry, Mango News Telugu, Mango News
Tamil actor Vijay, Thalapathy Vijay, political party, Tamilnadu

ముందు నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమయింది. తమిళనాడులో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ జరుగుతోన్న ప్రచారానికి పులిస్టాప్ పడింది. ఎట్టకేలకు దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడులో కొత్త పార్టీని స్థాపించారు. తన పార్టీ తమిళగ వెట్రి కళగం పేరును విజయ్ అధికారికంగా ప్రకటించారు. 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా విజయ్ పార్టీని నెలకొల్పారు. అయితే ఎన్నోఏళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న అభిమానులు.. తాజా ప్రకటనతో సంబురాలు చేసుకుంటున్నారు.

అయితే గత మూడు, నాలుగు ఏళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కానీ పలు కారణాల వల్ల ఆయన రాజకీయాల్లోకి రావడం ఆలస్యమయింది. గతంలో తన భార్య వల్లే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆలస్యమయిందని ప్రచారం జరిగింది. తన భార్యకు విజయ్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని.. తన కొడుకుకి కూడా ఇష్టం లేదని వార్తలొచ్చాయి. వాళ్లని ఒప్పించడానికే విజయ్ సమయం తీసుకున్నారని.. చివరికి ఇప్పుడు వారు ఒప్పుకోకపోయినా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది.

ఓవైపు పార్టీ స్థాపించేందుకు కొద్దిరోజులుగా సన్నాహాలు చేస్తూనే.. అటు పలు సేవా కార్యక్రమాలను విజయ్ చేస్తు్ననారు. తన అభిమాన సంఘం మక్కళ్ ఇయక్కుమ్ ద్వారా తమిళనాడు వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ఉచిత విద్య కేంద్రాలు, న్యాయ సలహా కేంద్రాలు, రక్త దాన శిబిరాలతో పాటు పలు కార్యక్రమాలను  నిర్వహిస్తున్నారు. ఇటీవల తుఫాన్ దెబ్బకు నష్టపోయిన ప్రజలకు కూడా సహాయ సహకారాలు అందించారు.

ఇక చివరికి ఎట్టకేలకు విజయ్ పార్టీని నెలకొల్పారు. ఈ మేరకు పార్టీ పేరును ప్రకటిస్తూ విజయ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోందన్న విజయ్.. దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పుకొచ్చారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని.. ఇతర పార్టీలకు కూడా ఎటువంటి మద్ధతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. అలాగే తమ పార్టీ, అజెండాను కూడా త్వరలోనే ప్రకటిస్తామని విజయ్ చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 7 =