లండన్ పర్యటన సందర్భంగా.. బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించనున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

Congress Leader Rahul Gandhi Set To Address British Parliament During London Visit,Congress Leader Rahul Gandhi,Rahul Gandhi To Address British Parliament,Rahul Gandhi During London Visit,Mango News,Mango News Telugu,Rahul Gandhi London Visit,Indian Politics, Indian Political News, National Political News, Latest Indian Political News,Rahul Gandhi Live News,Rahul Gandhi Latest News And Updates,Rahul Gandhi To Hold Sessions

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ 10 రోజుల పర్యటన నిమిత్తం ఇంగ్లండ్‌లో ఉన్నారు. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు ఆయన లండన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ బ్రిటీష్ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. ఈ మేరకు మార్చి 6వ తేదీన వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌లోని గ్రాండ్‌ కమిటీ రూమ్‌లో యూకే ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి రాహుల్‌ గాంధీ ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. అలాగే స్థానిక భారతీయ ప్రవాసులను కలవనున్నారు. ఇంకా ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరియు ప్రసిద్ధ లండన్ థింక్ ట్యాంక్‌లో ప్రసంగించనున్నారు.

భారత సంతతికి చెందిన యూకే ఎంపీ వీరేంద్ర శర్మ దీనిపై స్పందిస్తూ, రాహుల్‌ గాంధీ కేవలం రాజకీయాలపై మాత్రమే కాదని, ఇరు దేశాల మధ్య ఉన్న సంస్కృతి, సామాజిక, వ్యాపార బంధాలపై కూడా ప్రసంగిస్తారని తెలిపారు. ఎందుకంటే ప్రజలే సజీవ వారధి కాబట్టి, రెండు దేశాలను బంధించే సాంస్కృతిక, సామాజిక మరియు వ్యాపార సంబంధాలను స్వీకరించాలి అని శర్మ పేర్కొన్నారు. కాగా తాజాగా అమెరికాలోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో రాహుల్‌ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. భార‌త ప్రజాస్వామ్య వ్యవ‌స్థపై దాడి జ‌రుగుతోంద‌ని, ప్రతిప‌క్ష నేత‌ల‌పై నిఘా కోసం ప్రభుత్వం పెగాస‌స్‌ స్పైవేర్‌ను వినియోగిస్తోంద‌ని ఆరోపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 12 =