మేడారంలో వన దేవతలను దర్శించుకున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రేణుక సింగ్

2022 Medaram Jatara, Central Minster Kishan Reddy, Central Minsters Kishan Reddy Renuka Singh Visits Medaram Maha Jathara Today, CM KCR, Kishan Reddy, Mango News, Medaram Jatara 2022, Medaram Jatara Latest Updates, Medaram Jatara News, Medaram Maha Jathara, medaram sammakka sarakka jatara, Renuka Singh, Renuka Singh Visits Medaram Maha Jathara Today, Sammakka Sarakka Jatara 2022, Sammakka-Saralamma Maha Jathara

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర నేటితో మూడురోజుకి చేరుకుంది. పలువురు ప్రముఖులు మేడారం చేరుకొని సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ లు మేడారంలో పర్యటించారు. ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో మేడారం చేరుకున్న కేంద్ర మంత్రులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గద్దెలపై సమ్మక్క–సారలమ్మల దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు మేడారం జాతర ప్రతీక అని అన్నారు. తెలంగాణలోని ములుగులో త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోందని, ఇందుకోసం కేంద్రం రూ.45 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. అలాగే మేడారం పరిసర ప్రాంతాలను ట్రైబల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక కేంద్ర గిరిజ‌న శాఖ మంత్రి రేణుక సింగ్ మాట్లాడుతూ, ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామన్నారు. గిరిజనుల అభ్యున్నతి, అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించార‌ని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ