ఆసియా కప్‌ 2022: సూపర్‌-4లో నేడు కీలక మ్యాచ్, మరోసారి పాక్‌తో తలపడనున్న భారత్‌

Asia Cup 2022 Unbeaten India To Play High Octane Against Pakistan in Super 4 Match, India And Pakistan Super 4 Match, Asia Cup Super4 Match, India vs Pakistan Asia Cup 2022, India vs Pakistan Latest News And Updates, India vs Pakistan Live Updates, Asia Cup 2022, Ind vs Pak Asia Cup 2022, India vs Pakistan Highlights, India Wins Against Pakistan , IND vs PAK Highlights, Ind vs Pak Live Streaming, Ind Vs Pak Match Score

క్రికెట్‌ అభిమానులకు ఈ ఆదివారం సిసలైన వినోదం లభించనుంది. యూఏఈలోని దుబాయ్ మరియు షార్జా వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌ టోర్నమెంట్‌ మొదటి దశ ముగిసి సూప‌ర్ 4 స్టేజ్‌కు చేరుకుంది. ఇక సూపర్ 4లో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరగనుండగా, మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాదించనున్నాయి. దీనిలో భాగంగా నేడు దాయాది జట్లు భారత్, పాకిస్తాన్‌ మధ్య నేడు కీలక మ్యాచ్ జరుగనుంది. అయితే గత ఆదివారం ఇరు జట్లు టోర్నీలో తమ తొలి మ్యాచ్‌ను ఆడిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో భారత్ చివరి ఓవర్‌లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సిక్సర్‌తో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఇక వారం రోజుల వ్యవధిలో భారత్, పాకిస్తాన్‌ ఆదివారం మరోసారి తలపడనుండటం గమనార్హం. ఈ క్రమంలో ‘సూపర్‌–4’ స్టేజ్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

ఆదివారం జ‌రిగే ఈ కీలక పోరు కోసం ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు రెండు దేశాల్లోని కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా సూప‌ర్ 4 స్టేజ్‌లో భాగంగా జరగనున్న ఈ టఫ్ ఫైట్‌లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. రోహిత్‌ శర్మ సారధ్యంలోని భారత జట్టు టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి ఊపు మీద ఉంది. ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించి ఫామ్ లోకి రావడం శుభపరిణామం. అయితే ఓపెనర్లు కెప్టెన్ రోహిత్, రాహుల్ భారీ స్కోర్లు సాధించలేకపోతున్నారు. ఇక యువ బౌలర్లు కీలక ఓవర్లలో తేలిపోతున్నారు. ఈ లోపాలను సరిదిద్దుకుంటే నేటి మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించే అవకాశం ఉంది.

మరోవైపు పాకిస్తాన్ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని కసిగా ఉంది. అయితే కీలక బౌలర్ షా నవాజ్‌ దహానీ గాయంతో ఆసియా కప్‌నకు దూరమవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. కాకపోతే యువ పేసర్లు నసీమ్‌ షా, ఖుష్‌ దిల్‌షా, స్పిన్నర్‌ షాదాబ్‌లు బౌలింగ్‌లో రాణిస్తుండటం పాక్‌కు కలిసొచ్చే అంశం. దీంతో ఈరోజు మ్యాచ్‌లో భారత్ జోరు కొనసాగిస్తుందా లేక బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్సీలోని పాక్‌ బదులు తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా ఉంది. ఏది ఏమైనా ఈ ఆదివారం క్రికెట్ అభిమానులు మరో హై వోల్టేజ్ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. నేటి రాత్రి గం.7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. కాగా శనివారం జరిగిన సూప‌ర్ 4 స్టేజ్‌ మొదటి మ్యాచ్‌లో శ్రీలంక ఆఫ్ఘానిస్థాన్‌పై గెలిచిన సంగతి తెలిసిందే.

జట్లు అంచనా..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

పాకిస్తాన్: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్‌ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, హసన్ అలీ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + nineteen =