ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండడం, అలాగే కోవిడ్ యొక్క కొత్త వేరియంట్స్ దేశంలో ప్రభావం చూపే అవకాశమున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
“చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ మరియు థాయిలాండ్ నుండి భారతదేశానికి ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణీకులు ఆయా దేశాలు లేదా గమ్యస్థానాల నుండి బయలుదేరే ముందు తప్పనిసరిగా కోవిడ్ కు సంబంధించి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి మరియు 2023, జనవరి 1 నుండి ఎయిర్ సువిధ పోర్టల్‌లో కోవిడ్ నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్ ను అప్‌లోడ్ చేయాలి” అని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. భారతదేశానికి ప్రయాణాన్ని ప్రారంభించే ముందు 72 గంటల్లోగా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఈ నిబంధన పోర్ట్ ఆఫ్ డిపార్చర్‌తో సంబంధం లేకుండా భారతదేశానికి వచ్చే అన్ని అంతర్జాతీయ విమానాల్లోని అంతర్జాతీయ ప్రయాణీకులకు నిర్వహించే 2 శాతం ర్యాండమ్ పరీక్షలకు అదనంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పైన పేర్కొన్న దేశాలలో నెలకున్న కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోబడిందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE