గోషామహాల్ పరిధిలోని కూలిపోయిన నాలా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి తలసాని, రూ.కోటి 27 లక్షలు మంజూరు

Minister Talasani Srinivas Yadav Inspects Collapsed Naala in Chaknawadi Goshamahal Area,Minister Talasani Srinivas Yadav,Collapsed Naala in Chaknawadi,Chaknawadi Goshamahal Area,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

హైదరాబాద్ నగరంలో నాలాలపై ఉన్న ఆక్రమణలను అన్ని తొలగించాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం గోషామహాల్ నియోజకవర్గ పరిధిలోని చాక్నవాడిలో ఇటీవల కూలిపోయిన నాలా ప్రాంతాన్ని జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన వంతెన నిర్మాణం కోసం కోటి 27 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు. రెండు, మూడు రోజులలో పనులు ప్రారంభించి నెలన్నరలో పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఈ నాలా పూర్తిస్థాయి అభివృద్ధి పనులు చేపట్టడం కోసం నాలా ప్రారంభం నుండి మూసీ నదిలో కలిసే వరకు మొత్తం అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

గురుద్వార్ వద్ద 6 కుటుంబాలు ఎంతో కాలం నుండి నివసిస్తున్నాయని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఒక ప్రణాళికతో 6 నుండి 7 నెలల్లో నాలా అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. హెవీ లోడ్ వాహనాల రాకపోకల వలన వంతెనలు దెబ్బతింటున్నాయని స్థానికులు మంత్రికి విన్నవించగా, వాటిని నియంత్రించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఉస్మాన్ గంజ్ లో నాలా వెంట ఉన్న ఆక్రమణలను గతంలో ఎవరు తొలగించలేదని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తొలగించినట్లు చెప్పారు. అక్రమ భవన నిర్మాణాలుపై దందా చేయడం, బ్లాక్ మెయిల్ కు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. అటువంటి వారిని ప్రోత్సహించవద్దని అధికారులను ఆదేశించారు. ఏ పార్టీకి చెందిన వారు అయినా ఉపేక్షించవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 19 =