పెరుగుతున్న కరోనా కేసులు, ఆగస్టు 6 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

Chhattisgarh, Chhattisgarh Coronavirus, Chhattisgarh Govt, Chhattisgarh Govt Extends Lockdown, Chhattisgarh Govt Extends Lockdown in All Major Cities, Chhattisgarh Lockdown, Chhattisgarh Lockdown News

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి ఎక్కువుగా ఉన్న అన్ని నగరాల్లో లాక్‌డౌన్ ను ఆగస్టు 6 వరకు పొడిగిస్తునట్టు ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ అధ్యక్షతన జూలై 27, సోమవారం నాడు కేబినెట్ సమావేశం నిర్వహించి లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబే మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని రాయ్ పూర్, బిలై, దుర్గ్, బిలాస్ పూర్, రాజ్ నానద్ గావ్, రాయ్ ఘర్, అంబికాపూర్ లాంటి నగరాలు, ఇతర పట్టణాలలో ఆగస్టు 6 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో జూలై 22 నుంచి జూలై 28 వరకు ప్రకటించిన లాక్‌డౌన్ అమల్లో ఉంది. మరోవైపు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7613 కి చేరుకుంది. వీరిలో 4944 మంది కరోనా నుంచి కోలుకోగా, 2626 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే కరోనా వలన ఇప్పటివరకు 43 మంది మృతి చెందారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu