కరోనా వ్యాప్తి: ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

Andhra Pradesh, Andhra Pradesh News, AP Coronavirus, AP Government, AP Government Orders Over Corona Tests, AP Government Orders Over Corona Tests In Private Labs, Corona Tests in Andhra Pradesh, corona tests in ap, Corona Tests In Private Labs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 26, ఆదివారం ఉదయం 10 గంటల నాటికీ 16,43,319 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా వైద్య పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం మొదటినుంచి ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రైవేట్‌ ల్యాబ్స్ లో కరోనా పరీక్షల నిర్వహణపై‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ఉండాలని పేర్కొన్నారు. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు రూ.750 మాత్రమే వసూలు చేయాలని, ఆ నమూనాను ఆర్టీపీసీఆర్ పరీక్షకు పంపితే రూ.2800 మించి వసూలు చేయొద్దని ఆదేశించారు. ఇందులో పీపీఈ కిట్లు, మానవ వనరుల వ్యయం కూడా కలిపే ఉంటుందని చెప్పారు. అలాగే ఐసీఎంఆర్‌ అనుమతి ఉన్న ల్యాబ్‌లలోనే పరీక్షలు నిర్వహించాలని, డేటాను తప్పకుండా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =