కాంగ్రెస్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ కు కరోనా పాజిటివ్

Congress Leader Sachin Pilot Tested Positive for Coronavirus

దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే సచిన్‌ పైలట్‌ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. “నాకు కోవిడ్ 19 పాజిటివ్ గా తేలింది. గత కొన్ని రోజులుగా నాతో సంప్రదించిన వారంతా దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి. చికిత్సపై వైద్యుల సలహా తీసుకుంటున్నాను. కరోనా నుంచి త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నాను” అని సచిన్ పైలట్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ