కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత

#Karnataka, B Narayan Rao Death, Basvakalyan Narayan Rao, Congress MLA B Narayan Rao dies, Congress MLA B Narayan Rao dies of severe coronavirus, Congress MLA Narayan Rao Died Due to Covid-19, Coronavirus, INC MLA B Narayan Rao Dies, INC MLA B Narayan Rao Dies Due To COVID-19 In Karnataka, Karnataka Congress MLA Narayan Rao dies, MLA Narayan Rao Died Due to Covid-19

కరోనా మహమ్మారి వలన దేశంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కన్నుమూశారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే బి నారాయణ్ రావు కూడా కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. నారాయణ్ రావు కి కరోనా పాజిటివ్ గా తేలడంతో సెప్టెంబర్ 1 నుండి బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మల్టి ఆర్గాన్ ఫెయిల్యూర్ తో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం నాడు ఆయన తుదిశ్వాస విడిచారు.

ఉత్తర కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని బసవకళ్యాణ్‌ నియోజకవర్గానికి నారాయణ్ రావు ‌ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే నారాయణ్ రావు మృతి పట్ల పలు పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవలే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎంపీ, కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేశ్‌ అంగాడి , బీజేపీ రాజ్యసభ ఎంపీ కూడా అశోక్ గస్తీ కూడా కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. మరోవైపు దేశంలో సెప్టెంబర్ 25 నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,18,570 కు చేరుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here