రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం, పలు కీలక నిర్ణయాలు?

Congress Party 85th Plenary Session Begins In Raipur Today Plenary Schedule Details Here, Congress Party 85th Plenary Session, Plenary Schedule Details, Plenary Session Begins In Raipur, Congress Party Raipur Session,Raipur Plenary Session, Mango News, Mango News Telugu, 85Th Amendment,85Th Amendment Act,85Th Amendment Act 2023,85Th Constitutional Amendment,85Th Plenary Session Of Congress,85Th Plenary Session Of The Indian National Congress,Whats A Plenary Session,Plenary Session At A Conference,Plenary Session Example

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌ లో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో జరగనున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. భారత్ జోడో యాత్రతో దేశంలో ఊపందుకున్న కాంగ్రెస్, ఈ ప్లీనరి సందర్భంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌, బీజేపీని ఎదుర్కోవడం, ఇతర ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని వెళ్లడం సహా పార్టీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఈ ఫ్లీనరిలో కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటుగా దేశవ్యాప్తంగా 15,000 మందికిపైగా కాంగ్రెస్ ప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం మధ్యాహ్నం రాయ్‌పూర్‌ కు చేరుకోనున్నట్టు తెలుస్తుంది.

ప్లీనరీ సమావేశాల్లో ముందుగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేస్తూ, “కాంగ్రెస్ యొక్క ప్రతి సదస్సులో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడ్డాయి, దాని కారణంగా మా సంస్థ ముందుకు సాగింది. ఆయా చోట్ల తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయాయి. నయా రాయ్‌పూర్‌ని చరిత్రలో నమోదు చేయడానికి మాకు ఈ అవకాశం ఉంది, ఇది రాబోయే కాలంలో పార్టీకి మార్గాన్ని చూపుతుంది” అని పేర్కొన్నారు. కాగా పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో సీడబ్ల్యూసీ ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

కాంగ్రెస్ ఫ్లీనరి షెడ్యూల్:

  • ఫిబ్రవరి 24 : స్టీరింగ్ కమిటీ సమావేశం, సబ్జెక్ట్ కమిటీ సమావేశం. సబ్జెక్ట్ కమిటీ సమావేశంలో 6 ప్రతిపాదనలు చర్చించబడతాయి.
  • ఫిబ్రవరి 25: రాజకీయ, ఆర్థిక మరియు అంతర్జాతీయ అంశాల తీర్మానాలపై చర్చ.
  • ఫిబ్రవరి 26: వ్యవసాయ, రైతు సంక్షేమంపై చర్చ, విద్యా, యువత ఉపాధి మరియు సామాజిక న్యాయం, సాధికారత వంటి అంశాలపై చర్చ. ఆదివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగం, సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహణ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE