ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమారుడి ప్రమేయంపై ఒంగోలు ఎంపీ మాగుంట కీలక వ్యాఖ్యలు

Delhi Liquor Scam Mp Magunta Srinivasulu Reddy Denies Involvement Of His Son Raghava Reddy, Delhi Liquor Scam, Mp Magunta Srinivasulu Reddy, Srinivasulu Reddy Denies Involvement, Mp Srinivasulu Denies Son Raghava Reddy Involvement, Delhi Liquor Scam Mp Magunta, Mango News, Mango News Telugu, Delhi Govt Liquor Policy,Delhi Liquor Case,Delhi Liquor Policy Controversy,Delhi Liquor Policy Scam,Delhi Liquor Policy Scam Explained,Delhi Liquor Scam Accused List,Delhi Liquor Scam Details,Delhi Liquor Scam Fir,Delhi Liquor Store Phone Number,Delhi New Liquor Policy,Is Liquor Available In Delhi,Liquor Policy In Delhi,Liquor Policy In India

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమారుడి ప్రమేయంపై ఒంగోలు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్‌ కుంభకోణంలో తనపై, తన కొడుకుపై, వారి సంస్థపై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు దీనిపై ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ మద్యం కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన ఆయన ఇది దక్షిణ భారత మద్యం వ్యాపారులపై ఉత్తరాది లిక్కర్ లాబీ పన్నిన కుట్ర అని పేర్కొన్నారు. ఇక తమ కుటుంబం 70 ఏళ్లుగా వ్యాపారంలో ఉందని, ఇన్నేళ్ళలో తమపై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని తెలిపారు. దీనిలో తనకుగానీ, తన కుమారుడికి గానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. అలాగే తమ కుటుంబం దశాబ్దాలుగా ప్రకాశం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, తమ పేరు, ప్రతిష్టలు దెబ్బ తీయడానికే ఈ వ్యవహారంలో తమను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ ఆరోపించారు.

తమ తండ్రి 1952లో మద్యం వ్యాపారం ప్రారంభించారని, ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామని ఎంపీ శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు. అయితే ఢిల్లీలోని మద్యం వ్యాపారులు తమను అడ్డుకుంటున్నారని, అక్కడి వ్యాపారంలోకి రానివ్వడం లేదని, గత ఆరు నెలలుగా కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అరోరా ఎవరో తమకు తెలియదని, ఇంతకు ముందు ఆ పేరు కూడా వినలేదని మాగుంట అన్నారు. గతంలో ఢిల్లీ, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్‌లోని తమ వ్యాపార కార్యాలయాలు, నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించిందని, అయితే ఈ దాడుల్లో ఈడీ అధికారులు ఎలాంటి తప్పును కనుగొనలేకపోయారని ఎంపీ మాగుంట తెలిపారు. కాగా వ్యాపారవేత్త అమిత్ అరోరాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిమాండ్ రిపోర్ట్‌లో, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరుల పేర్లను పేర్కొన్న విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − one =