గుజరాత్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్ గిరిజనులను అవమానిస్తోందని విమర్శలు

PM Modi Attends Election Campaign in Gujarat and Says Congress Insults Tribals Mocked Me For Wearing Tribal Attire,PM Modi Election Campaign in Gujarat, Congress Insults Tribals, Mocked Me For Wearing Tribal Attire,Mango News,Mango News Telugu,Narendra Modi,Gujarat , Gujarat Assembly Elections,Assembly Elections In Gujarat, Gujarat Assembly Poll,PM Narendra Modi, Modi Latest News And Updates,Gujarat Assembly News And Live Updates,

భారతదేశంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కాలం నుంచి గిరిజనులు జీవిస్తున్నారని, అయినప్పటికీ కాంగ్రెస్ వారి ఉనికిని పట్టించుకోలేదని విమర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వచ్చే నెలలో గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సోమవారం ఆయన జంబూసర్‌లో జరిగిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చాలా కాలంగా కాంగ్రెస్‌ నేతలకు భారతదేశంలో ఆదివాసీల ఉనికి గురించి తెలియదని, అసలు ఆ పార్టీకి ఆదివాసీల ఉనికి గురించే ఆలోచన లేదని అన్నారు. గిరిజనులు ఈ దేశంలో నివసించలేదా? వారికి ఇక్కడ హక్కులు లేవా? మరి వారు 1857లో బ్రిటీష్ వారిపై జరిగిన తిరుగుబాటులో ఎలా భాగమయ్యారు? అని ప్రశ్నలు సంధించారు గిరిజనులు ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని కాంగ్రే పార్టీ అవమానిస్తోందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ఇంకా ఇలా అన్నారు.. తాను ఎప్పుడైనా బహిరంగ కార్యక్రమాల్లో గిరిజనుల వేషధారణలో వస్తే తనను కాంగ్రెస్ ఎప్పుడూ ఎగతాళి చేస్తుందని, ఇది వారి అహంభావానికి నిదర్శనమని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళపాటు అధికారంలో ఉండి కూడా ఆదివాసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. లేకుంటే అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధాని అయ్యే వరకు గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు? అని ప్రశ్నించిన మోదీ, కేంద్రంలోని అటల్‌జీ ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి బడ్జెట్‌ను కేటాయించిందని గుర్తు చేశారు. కాగా జంబూసర్ గుజరాత్‌లోని గిరిజనులు అధికంగా ఉండే బరూచ్ జిల్లాలో ఉన్న పట్టణం కావడం గమనార్హం.

అలాగే, కాంగ్రెస్ నేతలు గిరిజనుల దుస్తులను ఎగతాళి చేయడం, గిరిజనులను అవమానించడం వల్ల కాంగ్రెస్ తమ పరిస్థితి మెరుగుపడుతుందని గిరిజనులు ఆశించలేరని ప్రధాని మోదీ అన్నారు. ఇక గత కాంగ్రెస్ అభ్యర్థులు గుజరాత్‌లో గిరిజనులను వదిలిపెట్టగా, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి విద్య, ఆరోగ్యం, పోషకాహార లోపం మరియు ఉపాధి వంటి ఇతర సమస్యలను పరిష్కరించిందని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం సూరత్ జిల్లాలోని మహువాలో గిరిజనుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘గిరిజనులు దేశానికి తొలి యజమానులు అని, అయితే బీజేపీ వారి హక్కులను హరించడానికి ప్రయత్నిస్తోందని’ కీలక వ్యాఖ్యలు చేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రకటన వెలువడటం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 16 =