ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ‘మెటా’ను తీవ్రవాద సంస్థగా ప్రకటించిన రష్యా

Russia Declares Mark Zuckerberg's Meta Company as Extremist Organisation, Russia Declares Meta as Extremist Organisation, Mark Zuckerberg Meta Company as Extremist Organisation, Russia Declares Meta as Terrorist Organisation, Mango News, Mango News Telugu, Meta Company, Facebook Meta, Russia Declares Meta A Terrorist Organisation, Meta Facebook Parent Company, Russia Moves to Declare Meta Extremist Organization, Russia Adds Meta to List of Extremist Groups, Meta Latest News And Updates, Facebook News And Live Updates

రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ‘మెటా’ను తీవ్రవాద సంస్థగా గుర్తించింది. ఫెడరల్ సర్వీస్ ఫర్ ఫైనాన్షియల్ మానిటరింగ్ (రోస్ఫిన్‌ మానిటరింగ్) యొక్క డేటాబేస్ ప్రకారం.. రష్యా తన ఉగ్రవాద మరియు తీవ్రవాద సంస్థల జాబితాలో ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ యొక్క మాతృ సంస్థ అయిన మెటాను చేర్చింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో, రష్యా కోర్టు ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌ను దేశంలో నిషేధించింది. తాజాగా వీటి మాతృ సంస్థ మెటాను ఉగ్ర‌వాదిగా పేర్కొంది. ఫిబ్రవరి 24న రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించినప్పటి నుండి, క్రెమ్లిన్ సోషల్ మీడియాపై తన నియంత్రణను కఠినతరం చేసింది. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను దేశంలోకి ప్రవేశించకుండా రష్యా విదేశాంగ శాఖ నిషేధించింది. జుకర్‌బర్గ్ రష్యా ఫోబిక్ ఎజెండాను ప్రచారం చేశారని ఆరోపించింది.

గత రెండు, మూడు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తన సైనిక దాడులను తీవ్రతరం చేసిన తర్వాత ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని సోషల్ మీడియా వినియోగదారులను రష్యన్‌లకు వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించే కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను అనుమతిస్తున్నట్లు మాస్కో కోర్టు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను ఆరోపించింది. అయితే మెటా యొక్క న్యాయవాది ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. మెటా సంస్థ ఎప్పుడూ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడలేదని, సహకరించలేదని కోర్టుకు తెలియజేశారు. ఇక రష్యా చర్యకు ప్రతిగా ఐరోపాలోని టెక్ కంపెనీలు రష్యన్ ప్రభుత్వ ప్రాయోజిత మీడియాను డీమోనిటైజ్ చేశాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 13 =